DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోషల్‌ మీడియాలో హద్దులు దాటిన స్వేచ్ఛకు అడ్డుకట్ట

*కొత్త రూల్స్ తో పార్టీల సోషల్ మీడియాకు బ్రేక్ పడనుందా?*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* సోషల్ మీడియా లైన  ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్. మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న సమాచారంపై పూర్తి నియంత్రణ ఉండేలా కేంద్రం

 కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా కొత్త సంస్కరణలను గురువారం ప్రకటించింది. అభ్యంతరకరమైన మార్ఫింగ్ పోస్టులను తొలగించాలని, లేని పక్షంలో ఆయా సంస్థలకు నోటీసులు ఇవ్వనుంది. 

పార్టీల పైత్యానికి బ్రేక్ పడనుందా? 

ఇటీవల కాలం లో సోషల్ మీడియా ను ఒక మంచి విషయాలకు

వాడేవాళ్లు సంఖ్యా చాలా తక్కువగా ఉంది. రాజకీయా పార్టీలు సోషల్ మీడియా వేదికగా చెప్పరాని అసభ్య పదజాలంతో, మార్ఫింగ్ ఫొటోలతో ఎదుటి వారిని అత్యంత నీచంగా కించపరచడం విచ్చలవిడిగా మారింది. దీంతో అధికార పార్టీ తరపున ప్రతిపక్ష సభ్యులపై పుంఖానుపుంఖాలుగా పొలిసు కేసులు కూడా నమోదవుతున్నాయి. వాళ్ళని జైలుకి సైతం

పంపుతున్నారు. 

ప్రస్తుతం కేంద్రం విధించిన కొత్త నిబంధనలతో సోషల్ మీడియా యుద్దానికి బ్రేక్ పడనుందా లేదా అనే విషయం వేచి చూడాలి. 

ఈ మేరకు  కేంద్ర మంత్రి  కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ నిబంధనలను ప్రకటించారు.
ఫిబ్రవరి 25 న విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు

మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) 2021 నిబంధనల ప్రకారం, ప్రభుత్వం లేదా చట్టపరమైన ఉత్తర్వుల తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాలి. 36 గంటలవరకు వేచి ఉండకూడదు. 

ముఖ్యమైన విషయాలు:

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డేటా ,కంటెంట్‌ను వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో

పరిష్కరించాలి. 

అభ్యంతరకరమైన గుర్తించిన తరువాత పోస్టును 24 గంటల్లో తొలగించాలి.  లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి.

ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు పోస్ట్‌  చేయరాదు. సోషల్‌ మీడియాలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.  

నోడల్ ఏజెన్సీ ద్వారా 24 గంటలు పనిచేస్తూ

పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదులను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.

ఈ నిబంధనలను ప్రచురించిన తేదీ నుండి 3 నెలల్లోపు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (సీసీఓ) ను నియమించాలి. చట్టానికి,నిబంధనలకు సీసీఓ బాధ్యత వహించాలి.

ఓటిటీ లో ఐదు అంశాలు బ్లాక్ 

అసభ్య, అశ్లీల, హింసాత్మక  కంటెంట్ పై

నిషేధం 

వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన

సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం

సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే పై నిషేధం

మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్‌పై నిషేధాజ్ఞలు

జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై కొనసాగనున్న

నిషేధం

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై నియంత్రణ 

అసత్య ప్రచారం ప్రారంభం చేసే తొలి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి

ఇటీవల రైతు ఉద్యమం నేపధ్యంలో కొన్ని హ్యాష్ ట్యాగ్‌లను వాడకుండా నియంత్రించాలని ట్విటర్‌ను కేంద్రం కోరగా, పాక్షికంగా పాటించడం వివాదానికి దారి తీసింది. ఈ

క్రమంలోనే కీలక చట్టాలను రూపొందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam