DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భగవద్గీత ఆగమనంతో అంతరిక్షం పరమ పునీతం కానుంది

*అంతరిక్షంలోకి  భగవద్గీత పంపిన ఇస్రో పిఎస్ఎల్ వి నౌక*   

*ఆదివారం అంతరిక్షంలో మరో అద్భుతం చేసిన భారత్* 
 
*ఉపగ్రహాల రూపకల్పనలో యువత కు అధిక ప్రాధాన్యం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* అంతరిక్ష అంతరాళాల్లో

అత్యంత పవిత్రమైన శ్రీమత్ భగవద్గీత శ్లోకాలు విస్తరించనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లో గల భారత్ అంతరిక్ష పరిశోధన శాల (ఇస్రో) అంతరిక్షంలో అద్భుతం ప్రయోగం చేసింది. ప్రపంచ మానవాళికి మార్గదర్శక గ్రంధమైనా శ్రీమద్భగవద్గీత ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టింది. దీంతో పాటు భారత ప్రధాని నరేంద్ర

మోడీ ఫోటోను కూడా పంపింది. ఎస్ డి సాటిలైట్ లో మోడీ ఫోటో, ఎస్ డి కార్డు లో భగవద్గీత లను అంతరిక్షంలోకి  పంపారు. పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ( పిఎస్ఎల్ వి)  సి 51 అంతరిక్ష నౌక ద్వారా బ్రెజిల్ కు చెందిన అమోజోనియా 1 ఉపగ్రహం తో పాటు, అమెరికాకు చెందిన 12 ఉపగ్రహాలు, సహా 18 చిన్న ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షం లోకి దిగ్విజయంగా ప్రవేశ

పెట్టింది. భారత రక్షణ రంగ అభివృద్ధి సంస్థ ( డి ఆర్ డి ఓ)  ఆధ్వర్యవంలో 18 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టింది. ఈ ఉపగ్రహాల రూపకల్పనలో యువత కు అధిక ప్రాధాన్యం కల్పించింది. డి ఆర్ డి ఓ ఆధ్వర్యవంలో యువ ఇంజనీర్లు సింధునేత్ర ఉపగ్రహాన్ని తయారు చేసారు. 

వసుధైవ కుటుంబకం సందేశాన్ని ప్రపంచానికి అందించే

విధంగా భగవద్గీత ను అంతరిక్షంలోకి పంపారు. 

యూనిటీ శాట్ అనేది మూడు ఉపగ్రహాల సంయుక్త ప్రయోగం. తమిళనాడు లోని శ్రీ పెరుంబుదూర్ కు చెందిన  జెపియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,  నాగ్ పుర కు చెందిన జిహెచ్ రైసాని ఇంజనీరింగ్ కళాశాల, తమిళనాడు లోని కోయంబత్తూర్ కు చెందిన  శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్

అండ్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించారు. ఈ మూడు రేడియో తరంగాలకు సంబంధించిన సేవలను అందించనున్నాయి.

డి ఆర్ డి ఓ ఆధ్వర్యవం లో రూపొందిన  సింధు నేత్ర ఉపగ్రహం హైద్రాబాద్ లోని ఇమారత్ రీసెర్చ్ కేంద్రం ద్వారా తయారైంది. ఈ ఉపగ్రహం అనుమానిత ఉపగ్రహాలు, నౌకలను గుర్తిస్తుంది. 

అంతరిక్షంలోని పంపిన 18

ఉపగ్రహాల్లో సాయి 1 , నానో కనెక్ట్ 2 , మెక్సికో యూనివర్సిటీ కి చెందిన ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూక్లియర్ సైన్సెస్ అఫ్ ది నేషనల్ అటానమస్ తయారు చేసింది. ఇది అమెరికా ఉత్పత్తిగా తెలియచేస్తున్నప్పడికి మెక్సికో తయారీ.    

అమెరికా కు చెందిన స్వార్మ్ టెక్నాలజీస్ రూపొందించిన 12 బుల్లి ఉపగ్రహాలను కూడా ఇస్రో ఆదివారం

అంతరిక్షంలోకి పంపింది. ఇవి ప్రపంచంలోనే అతి చిన్న సమాచార ఉపగ్రహాలు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam