DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని నరేంద్రునికి కోవిడ్ 19 తొలి విడత వాక్సిన్ అందజేత

*ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం వాక్సిన్ అందజేత* 

*ట్విట్టర్ లో మోడీ, పేస్ బుక్ లో అరవింద్ ప్రకటన.*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*ఢిల్లీ  / విశాఖపట్నం, మార్చి 1, 2021  (డి ఎన్ ఎస్):* భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కోవిడ్ 19 తొలి విడత వాక్సిన్ ను

అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లోని అల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) ఆసుపత్రిలో ఈ వాక్సిన్ ను వేయించుకున్నారు. ఈ విషయాన్నీ అయన ట్విట్టర్ లోని తన వ్యక్తిగత ఖాతాలో ప్రకటించారు. ఇదే విషయాన్నీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పేస్ బుక్ ద్వారా తెలియచేసారు. స్వదేశం లో శాస్తవేత్తలు రూపొందించిన ఈ మహత్తర మందు

ను తొలుతగా కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా సేవలు అందించిన వైద్య బృందాలు, పారా వైద్య సిబ్బంది, పోలీసులు, రక్షణ బలగాలు, అధికారులు, మునిసిపల్ సిబ్బంది, తదితరులు అందరికీ వారి ఇచ్చాపూర్వకంగా తొలివిడత వాక్సిన్ అందించిన విషయం తెలిసిందే. వారందరికీ తొలి విడత డోస్ ముగిసిన తదుపరి ప్రస్తుతం భారత ప్రధాని తొలి విడత డోస్ తీసుకోవడం

జరిగింది. 
ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ శాస్తవేత్తలు రూపొందించిన ఈ యజ్ఞం శుభపరిణమ్ అందించిందన్నారు. ఇతర దేశాలకు సైతం మన దేశం నుంచి ఈ వాక్సిన్ ను ఎగుమతి చేయడం జరిగిందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam