DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడాకేంద్రాల ఏర్పాటు కై అభ్యర్థులపై పెరుగుతున్న ఒత్తిడి

*విశాఖ 14 వ వార్డ్ లో క్రీడా కేంద్రం ఏర్పాటయ్యేనా?*

*ఈ వార్డులో అన్నీ అపార్ట్మెంట్ లే, క్రీడలకు ఖాళీయే లేదు*

*అభ్యర్థులపై అపార్ట్మెంట్ వాసులు కరుణ చూపేనా?*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 5, 2021  (డి ఎన్ ఎస్):* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ

ఎన్నికల్లో 14 వ వార్డు పరిధిలో అభ్యర్థులకు అత్యంత క్లిష్టమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న ఈ వార్డు లో అత్యదిక శాతం అపార్ట్మెంట్ లే ఉండడం తో క్రీడలకు అవకాశం లేకుండా పోయింది. ప్రధానంగా చిన్నారులు ఆటలాడుకునేందుకు తగిన స్థలం లేకపోవడం గమనార్హం. అపార్ట్మెంట్ ల్లో ఆటలకు ఖాళీ స్థలం ఉండదు,

క్రీడలకు వెళ్లాలంటే ఎక్కడో దూరంగా ఉన్న మైదాలను వెళ్లాల్సిన దుస్థితి. ఇదే ప్రాంతంలో పోర్ట్ మైదానం ఉన్నప్పడికి అందులోకి అందరికి అనుమతి లేకపోవడం గమనార్హం. 

పైగా ఈ ప్రాంతంలో అన్నీ తారు రోడ్డు లే కావడంతో ట్రాఫిక్ సమస్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ స్థితిలో రోడ్డుపై పిల్లలు, నడి వయస్కులు క్రీడలు అదే అవకాశం

కూడా లేదు.  

దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారానికి వచ్చిన సమయాల్లో క్రీడా సదుపాయాల కోసం స్థానికులు ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో అభ్యర్థులు కొంత ఆలోచనలో పడ్డారు. అస్సలు ఖాళీ స్థలమే లేని వార్డు లో క్రీడా వసతులు ఎలా ఏర్పాటు చెయ్యాలో తెలియక సందిగ్ధం లో పడుతున్నారు. 

ఈ వార్డు లో

అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కటారి అనిల్ రాజు ( ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి బంధువు ), భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎం. పరశురామ రాజు (అరకు పార్లమెంటరీ బీజేపీ ఇంచార్జి) ల మధ్య పోటీ నడుస్తోంది. ఈ ప్రాంతానికి సుపరిచితులుగా ఉన్న పరశురామ రాజు పట్ల ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికార పార్టీ

స్కీం ల పట్ల ఆకర్షితులైతే అనిల్ రాజు గెలిచే అవకాశం ఉంది. 

14 వ వార్డ్ పరిధులు : . . . 

Near N R I హాస్పిటల్,    TPT కాలనీ,  Near Old Post Office స్ట్రీట్ ,  TPT కాలనీ, 

Near APSEB ఆఫీస్ opposite,  Opposite Prince గెస్ట్  హౌస్ , Near Raama హాస్పిటల్  

Prince గెస్ట్ హౌస్, NH5 పెట్రోల్ బ్యాంకు Backside, Divya Sakthi అపార్ట్మెంట్ లైన్, 

MVP సూపర్

మార్కెట్ నుంచి Raghvendhra నర్సింగ్ హోమ్, విద్యుత్ నగర్, Near పోర్ట్ గ్రౌండ్  Westside, 

Near వెలమ భవనం, Near స్వర్ణ రెసిడెంట్స్, Near Sampath విల్లాస్ Aprt.,  B S Layout, 

Raghvendhra  నర్సింగ్ హోమ్ Street opposite, Andhra Bank ఎటిఎం opposite, 

Presidencial స్కూల్ opposite, Near More సూపర్ మార్కెట్, Simhadripuram Up Area, 

J R Nagar, శివ శాంకరి  Nagar, Old వెంకోజీపాలెం, Uma Nagar, నరసింహ నగర్,

దుర్గ నగర్

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam