DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ ప్రకటనపై అట్టుడుకుతున్న విశాఖ

*విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మాది ! అమ్మే హక్కు కేంద్రానికి లేదు?*

కార్మికుల ఉద్యమంతో అట్టుడుకుతున్న గాజువాక హైవే 

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఐక్యవేదిక చే మోడీ దిష్టబొమ్మ దగ్ధం

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 9, 2021  (డి ఎన్ ఎస్):*

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న పార్లమెంట్లో ప్రకటించడాన్ని ఖండిస్తూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ (అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జరిగింది. నరేంద్ర మోడీ

దిష్టి బొమ్మని కార్మిక సంఘాల నాయకులు తగలబెట్టారు. దిష్టిబొమ్మను తలపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా దాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. 
           ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక చైర్మన్‌ సిఐటియు గ్రేటర్‌ విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు

మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మే హక్కు ఎవడిచ్చాడని, అమ్మితే బీజేపీకి పుట్టగతులుండవని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకుంటారని బిజెపి ప్రభుత్వానికి హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పోరాడి సాధించుకున్నదని, నాడు రైతులు 22 వేల ఎకరాల భూమిని

ఇవ్వబట్టే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం ఇక్కడ జరిగిందని, స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం 32 మంది ప్రాణాల త్యాగం చేశారని, 67 మంది ఎమ్మెల్యేలు, 6గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ని మోడీ గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రారాష్ట్రానికి కొత్తగా

పరిశ్రమలు ఇవ్వని బిజెపి ఉన్నవి అమ్మేయడానికి సిద్దపడటం దుర్మార్గమన్నారు. ఆంధ్రరాష్ట్రానికి బిజెపి ఇప్పటికే తీవ్రద్రోహం చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ప్రజలు రోజూ ఆందోళనలు చేపడుతుంటే దానికి తలొగ్గకుండా పుండుమీద కారంచల్లినట్లు పరిశ్రమని అమ్మితీరుతామని ప్రకటించడం

దుర్మార్గమైనది. కేంద్ర బీజేపీ ప్రకటన రాగానే స్టీల్‌ ప్లాంట్‌లో  పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని అన్నారు. అలాగే  రేపు జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి దానికి సహకరిస్తున్న జనసేన పార్టీను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా విశాఖ

స్టీల్‌ప్లాంట్‌ అముతామన్న బీజేపీపై పార్లమెంట్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి పార్టీల ఎంపీలు ఏకమై పోరాడాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అద్యక్షులు ఆర్కేఎస్వీ కుమార్‌, ఎం.సుబ్బారావు, వై.రాజు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, పాపినాయుడు, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నాగభూషణం,

ఈశ్వరరావు, సిఐఎఫ్‌టియు కనకరావు, ఎఐఎఫ్‌టియు గణేష్‌పాండా, ఎఐసిసిటియు శంకరరావు, పబ్లిక్‌సెక్టార్‌ కో`ఆర్డినేషన్‌ కన్వీనర్‌ ఎస్‌.జ్యోతీశ్వరరావు, ఐద్వా కార్యదర్శి జి.ప్రియాంక, కె.కుమారి, అరుణోదయ సాంస్కృతిక విభాగం నిర్మల, ప్రజానాట్యమండలి నాయకులు దండునాగేశ్వరరావు, ఎం.చంటి, వార్వా కార్యదర్శి బి.బి.గణేష్‌,

వైఎస్‌ఆర్‌టియు నాయకులు దాడి సత్యన్నారాయణ, యూనివర్శిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు కె.ఎస్‌.కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam