DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారణాసి ఆశ్రమం లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం  

*కాశీ ఆంధ్ర ఆశ్రమం లో అత్యంత వైభవంగా శివరాత్రి*  

*విశ్వేశ్వరుని సన్నిధిలో రుద్ర, చండి బిల్వార్చనలు. . .*

*కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు: ట్రస్టీ వివి శాస్త్రి* 

*వారణాసి లోని ఆంధ్రా ఆశ్రమం పై DNS ప్రత్యేక కధనం*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*వారణాసి /

 విశాఖపట్నం, మార్చి 11, 2021 (డి ఎన్ ఎస్):*  వారణాశి లో గల ఆంధ్ర ఆశ్రమం లో అత్యంత వైభవంగా మహా శివరాత్రి వేడుకలను నిర్వహించినట్టు శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వి వి సుందర శాస్త్రీ తెలియచేసారు. మహా శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమం లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను DNS కు తెలియచేసారు.

 

గురువారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం వారణాసి లో రుద్ర హోమం, చండి, దశ మహావిద్య హోమములు, లక్ష కుంకుమార్చన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు అర్చక శ్రేష్ఠుల ఆధ్వర్యవం లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆశ్రమ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి ఆధారాధన అనంతరం

లింగోద్బవ కాలం లో స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుందని తెలిపారు. 

కరోనా నిబంధనలకు లోబడి :. . 
కరోనా మహమ్మారి కి టీకా అందుబాటులోకి వచినప్పడికి కరోనా నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్టు శాస్త్రి తెలిపారు.  

కేంద్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది  కరోనాసురుని విజృంభణ

ధాటికి తట్టుకునేందుకు మార్చి 2020 నుంచి తాత్కాలికంగా నిలిపివేయబడ్డ ఆశ్రమం తిరిగి సెప్టెంబర్ నెలాఖరులో తెరవబడింది. నాటి నుంచి పూర్తి స్థాయి సేవలను యాత్రికులకు అందించనున్నట్టు వివరించారు.  

కరోనా మహమారి కారణం గా కాశీలో చాలా మంది యాత్రికులు ఇరుక్కు పోవటం వలన  ఆశ్రమం తరపున అందరికీ ఉచిత వసతి భోజనం ఏర్పాటు

చేసి వారిని వారి వారి ఇంటికి బసులు ద్వారా పంపించే ఏర్పాటు చేసిందని తెలిపారు.  

ఆశ్రమం తరపున కాశీకి వచ్చే యాత్రికులకు మెయిన్ గేట్ దగ్గర శానిటైజ్ చెయ్యడం తో పాటు,  రోజుకి రెండు సార్లు కెమికల్ ద్వారా స్ప్రే చేయుట, రోజుకి రెండు సార్లు సాంబ్రాణి పొగ వేయుట వంటి పరిశుభ్ర కార్యాచరణ చేస్తున్నామన్నారు. ముఖానికి

మాస్కు ధరించిన వారికే ఆశ్రమం లోనికి  ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపారు. భోజనం దగ్గర రెండు గజాల దూరం పాటించేవిధంగా ఏర్పాటు చేశామన్నారు. రూమ్ ఖాళీ అయిన తరువాత రూముని సేనిటైజ్ చేయుట తగు జాగ్రత్తలు ఆశ్రమం తరపున తీసుకుంటున్నామని యాత్రికులు కాశీకి వచ్చేటపుడు  తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా అశ్రమం తరపున

కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇతర వివరాలకు : +91 94152 01729 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam