DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైందవ సమాజ చైతన్యం కోసం విశాఖ శారదా పీఠం కంకణం

*15 నుంచి ఉత్తరాంధ్రలో ధర్మ ప్రచార యాత్రకు స్వాత్మానంద*  

*గ్రామగ్రామాన హైందవత్వం ప్రజ్వలింప చేస్తున్న శారదాపీఠం*  

*మార్చి 31 న తిరుమల శ్రీనివాసుని సేవలో ముగియనున్న యాత్ర*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 12, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర

ప్రదేశ్ లో గ్రామా స్థాయి నుంచి  హైందవ సమాజంలో మరింత ఉత్తేజం, చైతన్యం పెంపొందించేందుకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు, అపర ఆదిశంకరులుగా ఖ్యాతి గాంచిన స్వరూనందేంద్ర సరస్వతి మహాస్వామి సంకల్పం చేసారు. ఈ నెల 15 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో హైందవ ధర్మ ప్రచార యాత్ర కు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రను శారదాపీఠం ఉత్తరాధికారి

స్వాత్మానంద సరస్వతి చేపట్టనున్నారు. ఈ యాత్ర ఈ నెల 29 వరకూ తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటన ముగించుకుని 29 న తిరుమల శ్రీనివాసుని దర్శించేందుకు బయలుదేరుతుంది. మార్చి 31 న గిరిజన, హరిజన సామాజిక వర్గాలకు చెందిన భక్తులందరితో కలిసి తిరుమల శ్రీనివాసుని దర్శించుకోనున్నారు. ఈ యాత్రలో భాగంగా

ప్రతి హిందువు చేయవలసిన కార్యాచరణ, ఆచరించవలసిన సంప్రదాయాలను, ధర్మాచరణను తెలియచేయనున్నారు. ప్రధానంగా యువతి యువకులతో సమావేశం నిర్వహించి, వారి ఆలోచనలను తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్ర వివరాలు:.. .

తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో 
రాజా మహేంద్రవరం : ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయం,  మార్కండేయ స్వామి

ఆలయం, దత్త మందిరం,
కొవ్వూరు: గోష్పాద క్షేత్రం
ద్రాక్షారామం: భీమశ్వర స్వామి ఆలయం
కాకినాడ : బాల త్రిపురసుందరి ఆలయం
 సామర్లకోట: కుమారా భీమేశ్వర స్వామి ఆలయం
సర్పవరం: భావన్నారాయణ స్వామి ఆలయం
పిఠాపురం: కుక్కుటేశ్వర స్వామి ఆలయం
అన్నవరం : సత్యనారాయణ స్వామి ఆలయం
కోటిపల్లి: కోటిలేంగేశ్వర స్వామి

ఆలయం

విశాఖపట్నం జిల్లా పర్యటన లో : 

పాడేరు: మోదకొండమ్మ తల్లి ఆలయం
మత్స్యపురం: మత్స్య లింగేశ్వర స్వామి ఆలయం
చోడవరం: కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి ఆలయం
విశాఖపట్నం: సంపత్ విజయకగర్ ఆలయం
విశాఖపట్నం: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం
ఉపమాక: శ్రీ వెంకటేశ్వర

స్వామి ఆలయం

శ్రీకాకుళం జిల్లా పర్యటన లో : 
మందస: వరాహ స్వామి ఆలయం
శ్రీకాకుళం: విజయ దుర్గ ఆలయం
అరసవల్లి: శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం
శ్రీకూర్మం: కూర్మనాథ స్వామి ఆలయం
శ్రీకాకుళం: కోటేశ్వర స్వామి ఆలయం
గుల్ల సీతారామపురం: శ్రీ సీతారామ స్వామి ఆలయం

విజయనగరం జిల్లా పర్యటన లో

బొబ్బిలి: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం
రామతీర్ధం: రామచంద్ర స్వామి ఆలయం
విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆలయం

మార్చి 29 - వేలాది మందితో తిరుమల శ్రీనివాసుని దర్శనానికి ప్రయాణం

మార్చి 31 - గిరిజన, హరిజన పుత్రులకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam