DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 వేల పరుగుల స్కోర్ దాటి క్రికెటర్ మిథాలీ రాజ్ కొత్త రికార్డు

*భారత్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు* 

*10 వేల పరుగుల మైలు రాయి దాటిన రెండో మహిళా*

*ఈ ఘనత సాధించిన తోలి భారత మహిళా క్రికెటర్ ఈమె*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 12, 2021  (డి ఎన్ ఎస్):*  అన్ని స్థాయిల క్రికెట్ పోటీల్లో 10

వేల పరుగులు మైలు రాయి దాటిన rendava mahilaa క్రికెట్ క్రీడాకారిణిగా భారత్ కు చెందిన మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించారు. శుక్రవారం దక్షిణాఫ్రికా  జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈమె 35 పరుగులు దాటడంతో ఈ ఘనత సాధించారు. ఈ ఘనత సాధించిన తొలిభారతీయురాలు ఈమె. ఈ ఘనత సాధించడానికి ఈమె 291 సార్లు బ్యాటింగ్ చేశారు. ఇదే మైలు రాయి దాటడానికి

ఎడ్వార్డు 316 సార్లు బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. 

వన్డే మ్యాచ్ ల్లో 7000 పరుగులు సాధించిన తోలి మహిళా క్రికెటర్ కూడా మిథాలీ రికార్డు నెలకొల్పారు.  

మిథాలి రాజ్ 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్

ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు పురస్కారం

లభించింది. ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది. 

మిథాలి తన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాజీవితంలో 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 45.50 సగటుతో 2776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20

అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్. టెస్టులలో 8 మ్యాచ్‌లు ఆడి 52 సగటుతో 522 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. ఇదే ఆమె యొక్క ఏకైక సెంచరీ. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam