DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత సీజేగా రెండవ తెలుగువారు జస్టిస్ ఎన్ వి రమణ ?

*అమితమైన ఆంధ్ర భాషాభిమాని ఈ అత్యున్నతులు* 

*అవసరమైతే తప్ప ఆంగ్లం మాట్లాడని అరుదైన న్యాయాధీశులు* 

*రిజర్వేషన్లు ఆర్థిక స్థితి బట్టే ఉండాలనే అభిప్రాయం చెప్పే అధికారి* 

*తిరుమల శ్రీనివాసుని పట్ల అచంచలమైన భక్తి కలవారు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మార్చి 24, 2021  (డి ఎన్ ఎస్):* భారత తదుపరి సర్వోన్నత న్యాయాధీశునిగా భాద్యతలు స్వీకరించే అవకాశం మెండుగా ఉన్నన్యాయ నిపుణులు జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా కు చెందిన వారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు లో న్యాయాధికారిగా విధులలో సేవలందిస్తున్నప్పడికి అవసరమైతే తప్ప ఆంగ్లం

లో మాట్లాడని తెలుగు భాషాభిమాని. 

కోట్లాది మంది హిందూ భక్తులకు ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీనివాసుని పట్ల అచంచలమైన భక్తి కలవారు జస్టిస్ రమణ. విద్యార్థి దశ నుంచి ఎన్నో పర్యాయాలు స్వామిని దర్శించుకున్న సంపూర్ణ ఆధ్యాత్మిక వేత్త. 

చీఫ్ జస్టిస్ గా రమణ నియమితులైతే. . ఈ హోదా చేరుకున్న రెండవ తెలుగు వారు

అవుతారు. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి శ్రీ కోకా సుబ్బారావు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల

విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి. ఎన్.కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు.

1983 ఫిబ్రవరి 10 నుంచి న్యాయవాదిగా సాధన ఆరంభించి ఉమ్మడి ఆంధ్ర

ప్రదేశ్హై కోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్

కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా

బాధ్యతలు నిర్వర్తించారు.

2013 సెప్టెంబరు 2 నాడు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా భాద్యతలు చేపట్టారు. 

తదుపరి  2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టులో వీరు రెండవ తెలుగు వారు. జస్టీస్ చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా

సేవలందించారు. 

తెలుగు భాషాభిమానాన్ని రమణ :. . .

రమణ కు తెలుగు భాష పై అభిమానం చాలా మక్కువ. తెలుగు వారు ఎవరితోనైనా సరే అయన తెలుగులోనే పలకరిస్తారు. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో

కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటారు.

న్యాయాధీశునిగా. . .అత్యున్నత తీర్పులు. . .

జస్టిస్ పదానికి, హోదాకు తగినట్టు తమ పరిధిలోకి వచ్చిన కేసులను సానుకూలంగా పరిష్కరించి, న్యాయ సమ్మతమైన పరిష్కారాలనే సూచించారు. 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల

కేసులను పరిష్కరించారు. వారు అందించిన తీర్పుల్లో. .. 

రిజర్వేషన్లు ఆర్థిక స్థితి బట్టే ఉండాలి : . .. 

భారత దేశంలో రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలని జస్టిస్ రమణ ఎన్నోసార్లు తెలియచేసారు. దీనికి ప్రధాన నిదర్శనమే. . .

ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల

ధర్మాసనంలో జస్టిస్‌ రమణ ఒకరు. ఈ కేసులో మెజారిటీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు.

ఆల్మట్టి డాం వివాదం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాదిగా పనిచేశారు.

పర్యావరణ

కేసుల్లో చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని తీర్పులు చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam