DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*నన్నయ లో క్రీడాభివృద్ధికి సాయ్ కమిటీ పరిశీలన*

*రాజమండ్రి లో కేంద్ర ఖేలో ఇండియా పథకం అమలు*

*శ్రీకాకుళం, మార్చి 25, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో క్రీడాభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియ (సాయ్) కమిటీ గురువారం విశ్వవిద్యాలయంలో పర్యటించి క్రీడా మైదానాలను, వసతులను పరిశీలించారు. కేంద్ర ఖేలో

ఇండియా పథకంలో భాగంగా క్రీడా ప్రాంగణాల మౌలిక సదుపాయాల నిర్మాణాలకు నిధులు మంజూరు ప్రతిపాదనలతో పాటు వాటి సాధ్యసాధ్యాలపై నివేదికను సమర్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియ(సాయ్) సభ్యులు ఏలూరుకు చెందిన సీనియర్ అథ్లెటిక్ కోచ్ ఇన్చార్జి డి.ఎన్.వి వినాయక ప్రసాద్, బెంగళూరు కు చెందిన సహాయ స్విమ్మింగ్ అకడమిక్ కోచ్

మాథ్యూస్ అబ్రహాం, విశాఖపట్నంకు చెందిన సీనియర్ వాలీబాల్ కోచ్ ఇన్చార్జి కె.సి త్రిపాఠి విశ్వవిద్యాలయ ప్రాగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిష్ట్రార్ ఆచార్య టి.అశోక్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో క్రీడాభివృద్ధికి సహకరిస్తున్న వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావుకు, ఎంపి మార్గాని భరత్ కు అభినందనలు

తెలియజేసారు. విశ్వవిద్యాలయంలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం {60×40మీటర్లు} నిర్మాణానికి, స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్{50×21 మీటర్లు}నిర్మాణ అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించిన కమిటీ పర్యటించిందని అన్నారు. సాంకేతిక నివేదికను ముగ్గురు

నిపుణుల కమిటీ క్షేత్ర పరిశీలన చేసి సిఫార్సును సమర్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డి.ఎన్.వి వినాయక ప్రసాద్ మాట్లాడుతూ పై నిర్మాణానికి కావల్సిన చక్కని వాతావరణం, ప్రాంగణం విశ్వవిద్యాలయంలో ఉందని తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణ పరిశీలనపై సంతృప్తి చెందుతున్నామని సానుకూలంగా స్పందించారు. కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్రీడలను అభివృద్ధి చేయడం ద్వారా విశ్వవిద్యాలయ ప్రగతి మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్.టేకి, డా.కె.సుబ్బారావు, డా.బి.రామ్ గోపాల్, పీడీ రాజు, విశ్వవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam