DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై కలెక్టర్లు చేసే బదిలీలు, పోస్టింగ్‍లలో ఆదిత్యనాద్‍ ప్రభావం?

*సిఎస్ దృష్టికి రాకుండా . . బదిలీలు ఉండకపోవచ్చు?* 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 26, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాద్‍దాస్‍ బాధ్యతలు స్వీకరించాక.. 13 జిల్లాల కలెక్టర్ల పనితీరుపై రహస్య నివేదిక తెప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 13

జిల్లాల కలెక్టర్లలో కొంతమంది కలెక్టర్లు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని.. ప్రజాప్రతినిధులు, అమాత్యులు చెప్పిందే వేదంగా అమలు చేస్తున్నారని.. వారికి మాత్రమే ఫోనుల్లో అందుబాటులో ఉంటూ మిగతా వారు ఎవరైనా ఫోను చేసినా అందుబాటులోకి రావటం లేదని.. ఆదిత్యనాద్‍ దృష్టికి ఆయనతో పరిచయం ఉన్న పలు జిల్లాల క్రింది

స్థాయి అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది.
తమకు ఫస్ట్ క్లాస్‍ మెజిస్ట్రేట్‍ హోదా ఉందని పలు జిల్లాల కలెక్టర్లు మరిచిపోయి అధికార నేతల ఆదేశాలకు మాత్రమే విలువ ఇస్తున్నట్లు ఆదిత్యనాద్‍దాస్‍ దృష్టికి వచ్చింది. త్వరలో కలెక్టర్లు బదిలీలు, పోస్టింగ్‍లు జరగబోతున్న నేపధ్యంలో తనకు వచ్చిన సమాచారాన్ని ముఖ్యమంత్రి

జగన్‍ దృష్టికి ఆదిత్యనాద్‍ తీసుకెళ్లే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొన్ని జిల్లాల బదిలీలలో తాహసీల్దార్ల పోస్టింగ్‍లపై నిషేదం ఉన్నప్పటికీ.. డిప్యూటేషన్‍ విధానంపై ఎలాంటి నిషేదం లేకపోవటంతో కొందరు కలెక్టర్లు ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్‍ విధానంతో తహాసీల్దార్లను బదిలీ చేశారు..

పోస్టింగ్‍లు కూడా ఇచ్చారు. అమాత్యులు, అధికార ప్రజాత్రినిధుల ఆదేశాలు నిబందనలకు విరుద్దంగా ఉన్నా.. ఏదో కారణం చూపి కొంతమంది కలెక్టర్టు అమలు చేస్తున్నారని.. ఆదిత్యనాద్‍దాస్‍కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు రావటంతో ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రధాన కార్యదర్శి భావిస్తున్నట్లు తెలిసింది.
పాత

సీఎస్‍ నీలంసహానిలా మౌనంగా ఉండకుండా జిల్లాలలో అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది. కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, సబ్‍ కలెక్టర్లు ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయం కూడా ఆదిత్యనాద్‍దాస్‍ తనకున్న అనుకూల మార్గాల ద్వారా తెలుసుకోగలిగారు.
ఇప్పటికే

ముఖ్యమంత్రితో ఆదిత్యనాద్‍ కలెక్టర్ల పనితీరుపై చర్చించారని.. ఆయనకు మొత్తం పరిస్థితిని అవగాహన కల్పించారని, కలెక్టర్లు బదిలీలు, పోస్టింగ్‍ల విషయంలో గత విధానాన్ని పక్కన పెట్టి (పాత సిఎస్‍ నీలంసహానితో కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‍లపై ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ఎప్పుడు చర్చించిన దాఖలాలు లేవు) ప్రభుత్వ ప్రధాన

కార్యదర్శితో ఇతర ముఖ్య అధికారులత• చర్చించాలని ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల భోగట్టా.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam