DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు లో కరోనా ప్రభావానికి వీసీదే భాద్యత: టిఎన్ఎస్ఎఫ్ గోపాల్

*నిర్యక్షం తో 19 ఏళ్ళ యువత జీవితాలతో ఆటలాడ వద్దు.*

*నో మాస్క్, నో దూరం, నో ధర్మో స్కాన్. ఇదే ఎయులో సీను*  

*ప్రసాద్ రెడ్డి ని తొలగించాలని టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు డిమాండ్* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 27, 2021, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర యూనివర్సిటీ

వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డి నిర్లక్ష్య  ధోరణి కారణంగానే ఆంద్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందిందని  ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 59 మంది

విద్యార్థులకు పైగా కరోనా వ్యాపించడంపై ఎపి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్  ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసాద్ రెడ్డి ని తొలగించాలని డిమాండ్

ఆంధ్ర యూనివర్సిటీ లో ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలే విద్యార్థులకు

కరోనా వ్యాపించడానికి కారణమయ్యాయని, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిర్లక్ష్య ధోరణితో రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆంధ్ర యూనివర్సిటీ పేరుప్రతిష్టలతోపాటు,విద్యార్థుల అభివృద్ధికి అవరోధంగా మారాడని, ఎయు వైస్ ఛాన్సలర్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని, అతనిపై ఎపిడెమిక్ డిసీజస్ యాక్ట్  ప్రకారం అతని ఫై

చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నో మాస్క్, నో దూరం, నో ధర్మో స్కాన్. ఇదే ఎయులో సీను  

కళాశాలలో విద్యార్థులకు భౌతిక దూరం పాటించడంలోనూ, మాస్కులు ధరించమని అవగాహన కల్పించడంలోనూ, విద్యార్థులు కళాశాల కు వచ్చినప్పుడు కనీసం ధర్మామీటర్ తో కూడా టెంపరేచర్ చూడలేని దుస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ

అధికారులు ఉన్నారంటే  విద్యార్థుల ఆరోగ్యం పట్ల, వారి భవిష్యత్తు పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాత తరగతి గదులను శానిటైజ్ చేయించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించిన కారణంగానే విద్యార్థులు కరోనా వ్యాధి బారిన పడ్డారని,

మూడు రోజుల ముందే విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించినప్పుడు కూడా విజయసాయి రెడ్డి చుట్టూ ప్రదక్షణలు చేయడం, రాజకీయాలు చేయడం మినహా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లిదండ్రులు అభద్రతా భావాన్ని పెంపొందించారని , ఒక్కక్షణం కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రసాద్ రెడ్డి కొనసాగే హక్కు లేదని ప్రభుత్వం

తక్షణమే అతనిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు కరోనా బారిన పడకుండా రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో యూనివర్సిటీలలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థినీ విద్యార్థులకు కూడా కరోనా ప్రబలకుండా

తగిన జాగ్రత్తలు రాష్ట్రప్రభుత్వం తీసుకొని కరోనా వ్యాధి నుండి విద్యార్థులను రక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam