DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*హోలీ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డు మూసివేత*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 29, 2021, 2020 (డిఎన్ఎస్):* రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం తో హోలీ సందర్బంగా సోమవారం విశాఖ ఆర్ కె బీచ్ బీచ్ ను పోలీస్ లు తమ అధీనం లోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా బీచ్ ను పూర్తిగా మూసివేశారు. అయితే బీచ్ ప్రాంతం లో నివాసం ఉండేవారికి తమ ఆధారం

చూపితే వెసులు బాటు కల్పించారు. గతంలో హోలీ సందర్బంగా బీచ్ ప్రాంతం లో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున చేరి హోలీ పేరిట యువత బరితెగించి రోడ్ల పైనే వేడుకల పేరిట నృత్యాలు, రైన్ డాన్స్ లాంటివి చేసేవారు.  ఆ సందర్బంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడ చోటుచేసుకునేవి. కానీ ఈ సారి అటువంటి సంఘటనలు గాని, కరోనా ఉదృతి గాని పెరగకుండా

పోలీసులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు మంచి సత్పలితాలు ఇచ్చాయి.నగర పోలిస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఏ డి సి పి ఆదినారాయణ, ఏ సీ.పి కుమారస్వామి  సి ఐ లీలారావు, ఎస్ ఐ లు శంకర్, తాతారావు, తదితరులు పాల్గన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam