DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అండర్ 16 లో అదరగొడుతున్న విశాఖ క్రికెటర్ కేఏఎస్ ప్రసాద్ 

*ప్రాబబుల్స్ పరీక్షలోనే ప్రసాద్ బాట్ తో వరుసగా 5 సెంచరీలు*

*విశాఖ మైదానం నుంచి వెలుగులోకి వస్తున్న మరో బ్లాస్టర్. . .* 

*క్రికెట్ లో ఓనమాలు నేర్పిన కోచ్ జాన్ ప్రసాద్ అభినందనలు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 30, 2021 (డిఎన్ఎస్):* క్రికెట్ క్రీడా

ప్రపంచానికి పరిచయం కావాలంటే. . . బాట్ తో సెంచరీలు బాదాలి  లేదా. . . బాల్ తో వికెట్లు పీకాలి. ఇలా అయితేనే  కోటీశ్వరుల క్రీడగా పేరు పొందిన క్రికెట్ మైదానంలో ఎవరికైనా నిలువ నీడ లభిస్తుంది. ఈ సూత్రాన్ని బాగా వంటపట్టించుకున్నట్టుగా ఉన్నాడు విశాఖ కు చెందిన కె ఏ ఎస్ ప్రసాద్. విశాఖపట్నం జిల్లా క్రికెట్ క్రీడా సంఘం

నిర్వహిస్తున్న అండర్ 16 ప్రాబబుల్స్ జట్ల ఎంపిక పోటీల్లో తనదైన ముద్ర వేసుకుంటూ తన బాట్ తో వరుసగా 5 సెంచరీలు బాది, క్రీడా ప్రపంచానికి తనను పరిచయం చేసుకున్నాడు. ఇది ఒక రికార్డు గా నెలకొల్పబడింది. 

సాధించిన పరుగులు ఇవే. . . 

విడిసిఎ నిర్వహిస్తున్న అండర్ 16 జట్ల కోసం జరిగిన పోటీల్లో టీమ్ డి తరపున

పాల్గొన్న కె ఏ ఎస్ ప్రసాద్.  వరుసగా 100 పరుగులు,  102 పరుగులు,  111 పరుగులు,  117 పరుగులు,  103 పరుగులు, చెయ్యడంతో ఒక్కసారిగా మైదానం మారుమ్రోగిపోయింది. ఈ నెలలో 10 వ తేదీ నుంచి 27 వరకు జరిగిన మ్యాచ్ ల్లో ఇతను చేసిన స్కోర్ వివరాలు. . .

మార్చ్ 10 న : పరుగులు 100 ( మొత్తం బాల్స్ 118,  ఫోర్లు 14, స్ట్రైక్ రేట్ 84.75 )
మార్చ్ 12 న : పరుగులు 102 (

మొత్తం బాల్స్  103,    ఫోర్లు 13, స్ట్రైక్ రేట్ 99.03 )
మార్చ్ 14 న : పరుగులు 111 ( మొత్తం బాల్స్  143,    ఫోర్లు 14,    సిక్స్ 1 స్ట్రైక్ రేట్ 77.62 )
మార్చ్ 19 న : పరుగులు 117 ( మొత్తం బాల్స్  120,    ఫోర్లు 17,    సిక్స్ 1 స్ట్రైక్ రేట్  97.50 )
మార్చ్ 27 న :  పరుగులు 103 ( మొత్తం బాల్స్ 109, ఫోర్లు  13,  స్ట్రైక్ రేట్ 94.50 )

కోచ్

జాన్ ప్రసాద్ అభినందనలు : ., ..

ప్రసాద్ సాధించిన ఈ ఘనతకు ఇతనికి క్రికెట్ క్రీడలో ఓనమాలు నేర్పిన జాన్ ప్రసాద్ ( జెపి   క్రికెట్ అకాడమీ నిర్వాహకులు, విశాఖపట్నం) అభినందనలు తెలిపారు.  క్రీడారంగం లో ఇప్పుడు అడుగు పెడుతున్న ఈ యువకున్ని మరింతగా తీర్చి దిద్ది, సమర్థవంతుడైన క్రీడాకారునిగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత

ఎంతైనా ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam