DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాన సరస్వతి కి నిలువెత్తు రూపం సంగీత జనకులం

*సంగీత శిక్షణకై ఏప్రిల్ 25 న విద్యార్థులకు మౌఖిక పరీక్ష*

*జనకులంలో ఏడాది, రెండేళ్ల శిక్షణా తరగతులు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 1, 2021 (డిఎన్ఎస్):* సంత్సంప్రదాయ సంగీత విద్య కు నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తున్న ఐవిఎల్ సంగీత జనకులంలో

ఔత్సాహికులకు సంగీత శిక్షణ కై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  ప్రముఖ సంగీత విద్వాన్సులు విశాఖ అభినవ త్యాగరాజస్వామిగా కీర్తి గాంచిన కులపతి ఐవిఎల్ శాస్త్రి నెలకొల్పిన ఈ సంగీత జనకులంలో అయన సంగీత వారసుల సారధ్యంలో నేటికీ సంగీత యజ్ఞం కొనసాగుతోంది. 

కర్ణాటక సంగీతములో ఉచితముగా శిక్షణ ఇచ్చుటకు ఒక సంవత్సరం

సంగీత అవగాహన కోర్సు, రెండు సంవత్సరముల భక్తి సంగీతం కోర్సుల్లో నూతన తరగతులను సంగీత జనకులం ప్రారంభిస్తున్నట్టు సంగీతజనకులం.అధ్యక్షుడు, ఇంద్రగంటి కాళీ ప్రసాద్, తెలియచేస్తున్నారు. ఈ  తరగతులను ప్రముఖ సంగీత విద్వాన్సులు ఇంద్రగంటి కాళీ ప్రసాద్, ఇంద్రగంటి రమణి ప్రసాద్ ల సారధ్యం లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 
శిక్షణ

లో పాల్గొనదలచిన విద్యార్థులకు ఈ నెల 25 వ తేదీ ఆదివారం ఉదయం 6:30 నుండి 9 గంటల లోపు విశాఖపట్నం లోని రామ నగర్ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం లో మౌఖిక పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులను అక్కడే అందించాలన్నారు. 

అవగాహనా కోర్సు :

ఒక సంవత్సరం కాలం సంగీత అవగాహన కోర్సు ( Music Appreciation Course) ప్రతి ఆదివారం

ఉదయం 6:30 గంటల నుండి 8.30 గంటల వరకు విశాఖపట్నం లోని రామ్ నగర్ లో గల  శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం లో శిక్షణ ఇవ్వబడును. ఇందులో త్యాగరాజస్వామి రచనలు, శాస్త్రీయ సంగీత రాగములు తాళములు మొదలగు అంశములు,  శాస్త్రీయ సంగీత కచేరీలు అవగాహన చేసుకొను విషయములు నేర్పబడును. ఈ తరగతి  02-05-2021 తేదీ ఆదివారం ఉదయం 6:30 గంటలకు

ప్రారంభించబడును. 

గమనిక : ఒక సంవత్సరం సంగీత అవగాహనా తరగతికి దరఖాస్తు చేసుకొన్న వారందరూ  అదే సమయంలో చేర్చుకొనబడుదురు . దానికి మౌఖిక పరీక్ష ఏమీ లేదు. 

రెండేళ్ల భక్తి సంగీతం కోర్సు: . . .

రెండు సంవత్సరముల భక్తి సంగీతం కోర్సు లో తరగతులు వారంలో మూడు రోజులు జరుగనున్నాయి. ఈ భక్తి సంగీతం

తరగతులలో  త్యాగరాజ స్వామి, అన్నమాచార్య, రామదాసు, కబీరుదాసు, మీరాబాయి మొదలగు వాగ్గేయకారుల కీర్తనలతో పాటు కులపతి శ్రీ ఐ వి యల్ శాస్త్రి గారు రచించిన "సంగీత రత్నావళి" నుండి సంకీర్తనలు కూడా నేర్పబడును.  ఈ తరగతులు ఈ క్రింది విధముగా ప్రారంభించబడును.

1. ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు ఏంజెల్స్

ఎనక్లేవ్ , జగద్గురు పీఠం, 15-7-1, కృష్ణా నగర్, విశాఖపట్నం -21 నందు జరుగును. ఈ తరగతి  02-05-2021 ఆదివారం ఉదయం 9:00 గంటలకు ప్రారంభించబడును.

2. ప్రతి బుధ వారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు  మాష్టర్ హోమియో వైద్యాలయం, 45-42-9, పాతపోస్టు ఆఫిసు రోడ్ , అక్కయ్యపాలెం, విశాఖపట్నం -16 నందు జరుగును.  ఈతరగతి 05-05-2021 బుధ వారం ఉదయం 9:00 గంటలకు

ప్రారంభించబడును.

3. ప్రతి శనివారం ఉదయం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు మాష్టర్ హోమియో వైద్యాలయం, 45-42-9, పాతపోస్టు ఆఫిసు రోడ్ , అక్కయ్యపాలెం, విశాఖపట్నం -16 నందు జరుగును. ఈతరగతి 01-05-2021 శనివారం ఉదయం 9:00 గంటలకు  ప్రారంభించబడును.

 ముఖ్య గమనిక

1. రెండు సంవత్సరముల భక్తి సంగీతం కోర్సుకు దరఖాస్తు చేసుకున్నవారు

25-4-2021 ఆదివారం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉదయం 7 గంటల నుండి 9:30 గంటల వరకు నిర్వహించబడు మౌఖిక పరీక్ష కు హాజరు కావలెను. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సంగీత శిక్షణ ఇవ్వబడును.

2. అన్ని మతముల వారు, అన్ని కులముల వారు, అన్ని వయసుల వారు ప్రవేశమునకు అర్హులు.

3. ఈ తరగతులన్నియూ సంగీతం పట్ల భక్తి శ్రద్ధలతో

అభ్యసించవలెనన్న ఆసక్తి గల వారి కొరకై ఉచితముగా నిర్వహించబడుచున్నవి. క్రమము తప్పకుండా తరగతులకు హాజరగుట మరియు కోర్సు పూర్తి కాలము అభ్యసించుట విద్యార్ధి యొక్క బాధ్యత. ఏ కారణము చేతనైననూ తరగతి మధ్యలో మానివేసిననూ లేక తరగతులకు 75% కన్నా హాజరు తక్కువగా ఉన్ననూ రూ 5౦౦/- జరిమానా చెల్లించవలెను. ఈ సొమ్ము ప్రవేశార్హత పొందిన

విద్యార్థులు  దరఖాస్తు తో పాటు ధరావతుగా జమ చేయవలెను. క్లాసు సక్రమముగా పూర్తి చేసిన వారికి ఆ సొమ్ము తిరిగి వాపసు చేయబడును.

4. విద్యార్థులు అందరూ సంగీతజనకులం యొక్క  నియమ నిబంధనలను విధిగా పాటించవలెను.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam