DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగమ విధానాల్లో అనామకులు వ్రేళ్ళు పెడితే ఊరుకొం: శ్రీరామసేన  

*భద్రాచల క్షేత్ర ప్రతిష్ట పటిష్టత కై శ్రీరామసేన ఆవిర్భావం* 

*ఆగమ పరిరక్షణకై ఆగమ, వైదిక పండితులచే జేఏసీ కంకణం* 

*భద్రాచలం పై బురద జల్లే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం: జేఏసీ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 11, 2021 (డిఎన్ఎస్):* హిందూ ధార్మిక

క్షేత్రాలైన దేవాలయాల్లోని అర్చనలు, ఆరాధనలు ఆగమ శాస్త్ర విధానం ప్రకారం జరుగుతాయని, అలాంటి ఆగమ విధానాల్లో అనామకులు వ్రేళ్ళు పెడితే ఊరుకోమని శ్రీభద్రాచల రామ మహా సేన (శ్రీరామసేన)  జెఏసి హెచ్చరించింది.  
ఆలయాల్లో  ఆగమ విధానాలపై అనామకులు సొంత పైత్యాలు రుద్దకుండా అదుపు చేసేందుకు ఆగమ పండితులు, వేదపండితులు,

అర్చకులు, వైదిక సంప్రదాయ సంఘాలతో ఒక కార్యాచరణ ఏర్పాటు జరిగింది. 

శ్రీరామసేన ఆవిర్భావం. . .

ఏప్రిల్ 9, 2021 న  శ్రీ భద్రాచల రామ మహా సేన ( శ్రీరామసేన) పేరుతో  జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆవిర్భావం జరిగింది. హైదరాబాద్ లోని శ్రీవైష్ణవ సేవ సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక

తదితర ప్రాంతాలకు చెందిన వైదిక బంధువులు పాల్గొన్నారు. 

ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై భౌతిక దాడులు ఒక విధంగా జరుగుతుంటే. . .ఇతర సంప్రదాయాలకు చెందిన వారు, హిందూ వ్యతిరేకులు, స్వార్ధ పరులు తమ ఆధీపత్యాన్ని ప్రకటించుకునేందుకు బహిరంగ విమర్శలు చేస్తున్నారని మండిపడింది. 
వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని,

ఆలయంలో ఆగమ శాస్త్రాన్ని సంపూర్ణంగా అమలు జరిగేలా చూసేందుకే తమ జేఏసీ పనిచేస్తుందని ప్రకటించారు. 

భద్రాచలం తో శ్రీకారం. . .

ఆలయ వ్యవస్థల్లో అనామకులు, సంబంధం లేనివాళ్లు తమకు తోచిన సూచనలు చేస్తూ, ఆలయాలోని అర్చనలపై ప్రజలకు అపోహలు కలిగేలా ప్రచారం చేస్తున్నారని మండిపడింది. 

సుమారు 350 ఏళ్ల

నుండి నడుస్తున్న దేవాలయం శ్రీభద్రాచల దివ్యక్షేత్రం. గత కొన్నేళ్లుగా 
శ్రీ భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో తప్పుడు విధానం అమలు చేస్తున్నారంటూ కొందరు నానా రచ్చ చేయడం జరుగుతోందని, అలాంటి వాళ్ళ కు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు ఈ మహాజన కృషి చేస్తుందని ప్రకటించింది. 

శ్రీ రామ

మహాసేన  కేవలం భద్రాచల క్షేత్రం వరకే పరిమితం కాదని, ఇతర ప్రాంతాల్లోని ఆలయాలపై జరుగుతున్నా దాడులను కూడా అడ్డుకుంటూ ఆయా క్షేత్రాల వైభవాన్ని కొనసాగేలా చేస్తుందని ఏకగ్రీవంగా సభ్యులు ప్రకటించారు.  

కార్యాచరణ కమిటీ ఇదే:  . . .

శ్రీ భద్రాచల రామ మహా సేన కార్యాచరణ కమిటీ కి అధ్యక్షులుగా శ్రీశ్రీశ్రీ

కమలేష్ మహారాజ్ స్వామీజీ ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కన్వీనర్ గా గంగు ఉపేంద్ర శర్మ, కో కన్వీనర్ గా శ్రీభాష్యం యదుమోహన్ ఆచార్య, ప్రధాన కార్యదర్శి గా ఆనంద్ గౌడ్ లు నియమితులయ్యారు.   

కోశాధికారిగా భక్త రామదాసు 10వ తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు నియమితులయ్యారు. 

ఈ జె ఏ సి లో ప్రతినిధులుగా

 కాండురి నరేంద్రాచార్య (మాజీ కార్పొరేటర్), పరాంకుశం రవికిరణ్ ఆచార్య, రాజేశ్వరశర్మ, రాహుల్ దేశ్ పాండే,  యతిరాజుల బాల బాలాజీ, శ్రీనివాస రామానుజం, కందాళ వరదాచార్య, మంగళగిరి యాదగిరి స్వామి, కొండపాక కృష్ణమాచార్యులు, గట్టు శ్రీనివాసాచార్యులు, గట్టు రంగాచార్యులు, శ్రీధర్ సౌమిత్రి, పీతాంబరం వెంకట కిషోర్, తదితరులు

ఉన్నారు. 

ఈ శ్రీరామసేన లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారుగా 65 ప్రముఖ సంస్థలు వారందరూ భాగస్వాములుగా అంగీకార పత్రాలు అందజేశారు. 

శ్రీరామ సేన తీసుకున్న నిర్ణయాలు :

ఏ ఆలయం లో అర్చనలు ఏ ఆగమం ప్రకారం  ఏ సంప్రదాయంలో జరుగుతున్నాయో, ఆ ఆలయ ఆగమ సంప్రదాయములకు సంబంధం

లేనివారు వాటిని విమర్శించరాదు, తప్పు పట్టరాదు.

అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఆయా ఆగమ, సంప్రదాయాలకు చెందిన పెద్దలు న్యాయనిర్ణేతలు తప్ప ఇతరులు కాకూడదు.

దేవాలయ ట్రస్ట్ బోర్డులో, ఆయా సంప్రదాయ పెద్దలు ఒక్కరైనా మెంబర్స్ గా ఉండి, దేవాలయ సంప్రదాయాన్ని సక్రమంగా నిర్వహించే విధంగా ప్రయత్నం

జరగాలి 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam