DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విదేశాల నుంచి వచ్చిన వారిని ఇక్కడివారిగానే గుర్తించాలి 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 14, 2021  (డిఎన్ఎస్):*  ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ని రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ నగర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ కలిశారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ను కలిసిన ఆయన అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్

ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్యామిలీ (OCI) కుటుంబాల వారి సమస్యలను వివరించారు. 2005 నుంచి  ఏపీ, తెలంగాణా , కేరళ, మహారాష్ట్రాలకు చెందిన 35 లక్షల మంది వరకూ వివిధ దేశాలకు వెళ్ళారని, వారిలో లక్షల కుటుంబాలు తిరిగి వారివారి ప్రాంతాలకు వచ్చారు. అయితే కుటుంబాల పిల్లల చదువుల విషయంలో ఎన్ఆర్ఐలు గా గుర్తించి అత్యధిక ఫీజులు

వసూలు చేరడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత, సాంకేతిక విద్యలో ప్రభుత్వ కాలేజీలలో కూడా ఎన్ ఆర్ ఐ కేటగిరీ సీట్లు లేవు. చదువులలోనే కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ను కూడా ఎన్ ఆర్ ఐలుగా గుర్తించడం వల్ల  ఉద్యోగాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ ఆర్ ఐ కేటగిరీ తీసివేసి జనరల్ కేటగిరీ కింద మెరిట్ కేటగిరిలో విద్యాలయాలలో

అవకాశాలు కల్పించారు. ఐఐటి, ఎన్ ఐటీ, ఎఐఐఎంఎస్, ఐఐఎస్ సి తదితర విద్యారంగాలలో ఒసీఏ కార్డులున్న వారికి జనరల్ కేటగిరీ లోనే సీట్లు కేటాయించాలని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కుటుంబాలు కోరుతున్నారని వారి విద్యపరమైన సమస్యలను డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు వివరించారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో

విదేశాలలో వుండి సొంతూళ్ళు కు తిరిగొచ్చిన సాఫ్ట్వేర్ నిఫుణులకు సొంతంగా స్టార్టఫ్ కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. గత నెల మార్చి 4న కేంద్రప్రభుత్వం ఈ అంశాలుపై నోటిఫికేషన్ ఇస్తూ నిబంధనలు విధించిందని, వాటిని మార్పులు చేసి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కుటుంబాల వారికి, వారి పిల్లలకు చదువు, ఉద్యోగాల విషయంలో

న్యాయం చేయాలని ఉప రాష్ట్రపతి కి డాక్టర్ ఆకుల సత్యనారాయణ వివరించారు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఉప రాష్ట్రపతిని కలిసిన వారిలో వున్నారు. ఈ సమస్యలుపై స్పందించిన  ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు కేంద్రప్రభుత్వం మానవ వనరుల అభివృధ్ధి శాఖ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి

చేస్తామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam