DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో బీజేపీ కీలక అంశాలు  

*విద్య, 40 ఏళ్ళ పాలనా అనుభవం ఉన్న ఉన్నత అధికారి*

*రత్నప్రభ కు పెరుగుతున్న ప్రజాదరణ, భారీ అంచనాల్లో బీజేపీ* 

ఆంధ్రప్రదేశ్ బిజెపి కి ఓటు వేయడానికి 100 కారణాలు..

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి  / విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2021 (డిఎన్ఎస్):* తిరుపతి ఉప

ఎన్నికల్లో ప్రచారంలో బీజేపీ కీలక అంశాలు ప్రజల ముందుకు తీసుకువచ్చింది. తమ పార్టీ అభ్యర్థి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె. రత్నప్రభ తరపున ప్రచారాన్ని తారాస్థాయిలో చేస్తోంది. దీనిలో భాగంగా ఆమె విద్యార్ధతలు, పరిపాలన అనుభవాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఆమె విద్యావంతురాలు కావడమే కాక, 40 ఏళ్ళ పాటు పరిపాలనా అనుభవం ఉన్న ఉన్నత

అధికారి అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. పైగా ఆమె హయాంలో చేసిన అభివృద్ధి పనులను విస్తృతంగా తెరపైకి తీసుకు వస్తోంది. ఈమె విజయం పట్ల బీజేపీ భారీ అంచనాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ప్రజాధరణే. 

ఆంధ్రప్రదేశ్ బిజెపి కి ఓటు వేయడానికి 100 కారణాలు..

* స్వతంత్ర భారత దేశ చరిత్రలో చీఫ్

సెక్రటరీగా పగ్గాలు చేపట్టిన మొట్ట మొదటి దళిత ఆంధ్ర మహిళ IAS. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడే వ్యక్తి మన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు, 40 సంవత్సరాలు జనం కోసం సేవ చేశారు. పథకాలను అమలు చేయడంలో దిట్ట. తిరుపతి ప్రజలకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. రత్నప్రభ గారు జనం సేవకురాలు, వైసీపీ అభ్యర్థి జగన్ కు మాత్రమే సేవకుడు. * నరేంద్రమోదీ

ప్రభుత్వం ప్రతి సరాసరి ఒక గ్రామానికి సగటున 35 లక్షల రూపాయలు మంజూరు చేయడం gam Swaraj యాప్ ద్వారా దీని వివరాలు మీరు పొందవచ్చు. వైసిపి, టిడిపి గ్రామానికి 4000 నుంచి 5000 కూడా మంజూరు చేయించలేకపోయారు..

బిజెపి లో కుటుంబ పాలన లేదు.

తిరుపతికి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రాజెక్టులు స్థాపించి

ప్రారంభించడం జరిగింది. (IIT, IISER, SMART CITY, INTERNATIONAL AIRPORT, ICI)..
* రత్నప్రభ గారికి ఓటు నరేంద్రమోదీ గారికి వేస్తున్న ఓటు, అధికార పక్షానికి ఓటు..

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి మహానగర పవిత్రతను కాపాడాలంటే బిజెపి - జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయండి. కమలం గుర్తుకే మన ఓటు. కేంద్ర ప్రభుత్వం మూడు ఎలెక్ట్రానిక్ క్లస్టర్స్ ను

తిరుపతి పార్లమెంట్ లో స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. * కృష్ణపట్నంలో, శ్రీకాళహస్తిలో రెండు పారిశ్రామిక నగరాలను ఈ పార్లమెంట్ లో స్థాపించి స్థానికులందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకొంటోంది..

తిరుపతి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీ ని బలోపేతం

చేద్దాం.. పార్లమెంటు లో తెలుగువాణి వినిపిద్దాం అంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam