DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరంతర ప్రయాణం. .168 ఏళ్ళ .భారతీయ రైల్వే ప్రస్థానం

*బోరి బందర్‌ (ముంబై CST ) -  థానే వరకూ మొదటి రైలు  నేడు*

*ఒక్క రైలు తో మొదలై . . వేలాది రైళ్లు, లక్షలాది కిమీలు*

*కోట్లాది మంది ప్రయాణీకుల ఆత్మీయ బంధువు రైల్వే*

*భారత్‌ లో మొదటి రైలు కూత వినపడింది 1853 లో ఈ రోజే. . .*
 
*లాక్‌ డౌన్‌ నేపధ్యం లో కూడా నిరంతరంగా రైల్వే సేవలు  :. .

.*

    విశాఖపట్నం, ఏప్రిల్‌ 16, 2021 (డిఎన్‌ఎస్‌) : 1853 ఏప్రిల్‌ 16 , భారతీయ రైల్వే చరిత్రలో మరుపురాని రోజు. అఖండ భారతావనిలో మొదటి సారి రైలు కూత వినపడిన రోజు ఇదే.  బోరి బందర్‌ ( ముంబై  ఛత్రపతి శివాజీ మెట్రో టెర్మినస్‌ ) నుంచి థానే వరకూ జరిగిన మొదటి రైలు  ప్రస్థానం నేడు వేలాది రైళ్లు, లక్షలాది కిలోమీటర్లు

ప్రయాణం, కోట్లాది మంది ప్రయాణీకును గమ్యస్థానం చేరిక. . .ఇలా సాగుతోంది. 
    సామాన్యుల  నుంచి అసామాన్యుల వరకూ అన్ని వర్గాల  ప్రజలను  ఆత్మీయ బంధువుగా ప్రకటించుకునే భారతీయ రైల్వే లో లక్షలాది మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. దేశ ఆర్ధిక చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని కూడా అందిస్తూ

దేశాభివ్రిద్ది లో రైల్వే తనవంతు సహకారాన్ని అందిస్తోంది. 

400 మంది ప్రయాణీకుల తో . ..  
    సైనికుల  21 గన్‌  శాల్యూట్ ల తో గౌరవ వందనం చేయగా  14 కోచ్ లు తోను, మూడు లోకో మోటివ్‌ స్టీమ్‌ ఇంజన్‌ లు (వీటి పేర్లు . . . సాహిబ్‌, సింధ్‌, సుల్తాన్‌) బోరి బందర్‌ నుంచి బయలు  దేరి 400 మంది ప్రయాణీకును తోడ్కొని

ధానే కు బయలు  దేరింది. నాటి నుంచి నేటి వరకూ అద్వితీయమైన ప్రయాణంలో ఎన్నో రికార్డులు, విజయాlu, సౌకర్యాlu అందిస్తోంది. నేడు ప్రతి రోజు  2.3 కోట్ల మంది ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి రైళ్లు. 

1861 :  బొంబాయి, బరోడా ,  సెంట్రల్‌  ఇండియా (%దీదీజI%) చర్చ్‌ గేట్‌ వద్ద ప్రారంభం 
1864, : ఢిల్లీ లోని

చాందిని చౌక్‌ వద్ద కొత్త స్టేషన్‌ ప్రారంభం. అక్కడి నుంచి కొలకత్తా కు రైలు  ప్రారంభం. 
1867,: లక్నో నుంచి కాన్పూర్‌ కు మొదటి రైల్వే లైన్‌ ప్రారంభం. 
1870, : అత్యంత ప్రతిష్టాత్మకమైన సట్లెజ్‌ బ్రిడ్జి పూర్తి.
1880, : డార్జీలింగ్‌ స్టీమ్‌ ట్రాంవే ప్రారంభం. 
1895, : మొదటి లోకోమోటివ్‌ %ఖీ జశ్రీaంం 0-6-0 వీG ూశీషశీ%,

అజమీర్‌ లో ప్రారంభం. 
1911, : సముద్రం పై మొట్ట మొదటి రైల్వే బ్రిడ్జి  పంబన్‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణం మొదలు, 1914 లో పూర్తి.
1920, : దాదర్‌ - కర్రీ రోడ్‌ మధ్య ఎక్ట్రికల్‌ లైటింగ్‌ మొదలు.
1924 నుంచి 1944, : రైల్వేను జాతీయం చేసే ప్రక్రియ ఆరంభం. 
1928, : మొదటి ఆటోమేటిక్‌ కర్‌ లైట్‌ సిగ్నల్స్‌ ను బొంబాయి వీటి లో

మొదలు. 
1930, : పవర్‌ సిగ్నల్స్‌ మొదలు. డెక్కన్‌ క్వీన్‌ రైలు ప్రారంభం.
1943,  క్కోతా కు  ప్రతిష్ట తెచ్చిన హౌరా బ్రిడ్జి ప్రారంభం. దీంతో ట్రాంప్‌ కు అనుమతి. 
1954, : మొదటి సారిగా కోచ్‌ ల్లో 3 టైర్‌ స్లీపింగ్‌ సీటింగ్‌ ను రైళ్లలో ప్రవేశ పెట్టారు. .
1959, : మొదటి ఏసీ  ఎలెక్ట్రిక్స్‌ ను అమలు లోకి తెచ్చారు. 
/> 1961, :  1500 వోల్ట్స్‌ డీసీ  ఎక్ట్రిక్‌ లోకోమోటివ్స్‌ ను నిర్మించారు. వాటిల్లో మొదటిడి లోకమాన్య.  
1964, : తాజ్‌  ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ సర్వీస్‌ ను  న్యూ ఢిల్లీ -  ఆగ్రా మధ్య  ప్రవేశ పెట్టారు. 
1965, : రైల్వేస్‌ లో మొదటి రవాణా సేవను దేశ వ్యాప్తంగా ఆరంభించింది. 
1966, : సెంట్రలైజడ్‌ ట్రాఫిక్‌

కంట్రోల్‌ సిస్టం అమలు. 187 కిమీ పొడవు కల్గిన లైన్‌ గోరఖ్పూర్‌ - ఛాప్రా మధ్య ఉంది.
1986,: మొదటి సారి ప్రయాణీకుల టికెట్‌ ను కంప్యూటీరీకరణ చేసారు. 
1990, : సెల్ఫ్‌ ప్రింటింగ్‌ టికెట్‌ మెషిన్‌ ను న్యూ ఢిల్లీ లో మొదలు పెట్టారు. 
ఇవి కాక ఎన్నో మెయిు రాళ్లను భారతీయ రైల్వే అధిగమించి అత్యంత విజయ పధంలో నడుస్తోంది. 
/>     ప్రత్యేక రైల్వే జోన్ల ను ఏర్పాటు చేసి, పరిపాలన, ఆయా ప్రాంతాల ఆధునికీకరణకు అనువుగా ప్రణాళిక సిద్ధం చేసారు. కేవలం కొన్ని గంటలు మాత్రమే ప్రయాణించగలిగే రైలు  నుంచి, నేడు రోజు తరబడి అవిశ్రాంతంగా ప్రయాణించగలిగే విధంగా రైళ్లను ఆధునీకరణ చేసారు.

విభిన్న భోగీలు, రైళ్లు : . . .  

    ఒకే తరహా

బోగి / కోచ్‌ నుంచి నేడు సాధారణ, స్లీపర్‌, 3 వ ఏసీ, 2 వ ఏసీ , 1 వ ఏసీ, కోచ్‌  నే కాక, ఏకంగా మొత్తం రైంతా ఏసీ కోచ్‌ ను నడుపగలిగే స్థాయికి భారతీయ రైల్వే చేరుకుంది అంటే కేవలం ఏ ఒక్కరి కృషి మాత్రం కాదు. నిత్యం లక్షలాది మంది శ్రామికులు, సిబ్బంది, అధికారులు, ప్రభుత్వా సహకారం తో పాటు వీటికి ఆదాయ వనరులను అందించే ప్రయాణీకులు అందరూ

భాగస్వాములే. . .. 

లాక్‌ డౌన్‌ నేపధ్యం లో కూడా సేవలు  :. . .

    గత ఏడాది కరోనా ప్రభావంతో భారత దేశం మొత్తం పూర్తి గా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అన్ని రంగాల సంస్థలు, పరిశ్రమలు, రవాణా సదుపాయాలు, అన్నీ మూత పడిపోయినా భారతీయ రైల్వే మాత్రం నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. ప్రయాణీకులకు అనుమతి లేకపోయినా, రవాణా

రైళ్లు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. 

    ఈ విధమైన నిర్విరామ సేవలు అందించిన భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి కి చేరుకొని, ఆర్థికపరంగా, సాంకేతిక పరంగా ఉన్నత స్థితిలోనే ఉండాలి అని ఆశిస్తూ. . . మొత్తం భారతీయ రైల్వే కుటుంబానికి హార్దిక శుభాకాంక్షలు . . . తెలియచేస్తున్నాం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam