DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామానుజ నామం పలికితే మోక్ష మార్గానికి సుగమమైనట్టే

*రామానుజేత్యేషా చతురా చతురక్షరీ, అజరామరం* 

*ప్రతి యుగంలోనూ. .రామానుజ వైభవం, సాతులూరి రవి *  

*DNS కు సింహాచల క్షేత్ర వైదిక స్వామి ప్రత్యేక వివరణ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 18, 2021 (డిఎన్ఎస్):* రామానుజ నామం పలికితే మోక్ష మార్గానికి

సుగమమైనట్టే నని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం సింహాచల ఆలయ వైదిక పారాయణ ప్రవర్తకులు సాతులూరి సూర్యనారాయణాచార్యులు ( రవి ) తెలియచేస్తున్నారు. ఆదివారం భగవద్రామానుజుల తిరునక్షత్ర వైభవం సందర్బంగా రామానుజుల కేవలం నామ  వైభవాన్ని DNS కు ప్రత్యేకంగా వివరించారు. 

రామానుజేత్యేషా చతురా చతురక్షరీ అంటే

రామానుజ అనే నాలుగుఅక్షరాలను కల్గిన ఈ నామం చాలా చతురమైనదని కూరేశులు తెలియచేసిన రామానుజ వైభవం నేటికీ వాస్తవ రూపంలో దర్శనమిస్తోందని తెలియచేస్తున్నారు. 
సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సంస్థానంలో వైభవాన్ని అందుకునే ఆచార్యుల్లో అగ్రగణ్యులు రామానుజులేనన్నారు. ప్రతి యుగం ( త్రేత, ద్వాపర, కలియుగాలలో) లోనూ నారాయణ

నామం వున్నట్లే ఈ రామానుజ నామం కూడా ఉందని తెలిపారు. 

సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు ఆసీన పీఠమైన ఆదిశేషుడి ఈ సమాజాన్ని పరిరక్షించేందుకు భగవద్రామానుజావతారం లో  (AD 1017 - 1137) వచ్చారని, అది కూడా అవైదిక మార్గ నిరోధనార్ధం, వైదిక మార్గ సంస్ధానార్ధం, ప్రపత్తి మార్గ ప్రదర్శనార్ధం కోసమేనన్నారు.  కాని ఆ అవతారాలలో చాలా

 కొద్దిమంది మాత్రమే తరించగా, ఇక్కడ " కలియు కెడుమ్ "  "పోయిత్తు వల్లుయర్ శాపమ్ "పలువుర జీవుల శాపం పోయిందని  జీవులందరు ఉద్ధరింపబడ్డారు.

అందువల్ల  మిక్కిలి చాతుర్యాన్ని కల రామానుజ నామంతో ప్రపత్తి చేస్తూ  "అముదనార్ "ఇరామానుశ నూత్తన్దాది " ద్వయార్థ వివరణాత్మకంగా అనుగ్రహించారు అని

చెప్పవచ్చును. భగవద్రామానుజుల శ్రీ చరణములే మోక్షదాయకము.

నారాయణ నామం " కులమ్ తరుమ్ నలమ్ తరుమ్ నారాయణా ఎన్నుమ్  నామమ్ "( నారాయణ నామం కులాన్ని ఇస్తుంది, మంచిని కల్గిస్తుంది ) అని సకల పురుషార్ధ సాధనం, కాని రామానుజ నామం కేవల మోక్షైక హేతువు అని తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam