DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 2022 లో 216 అడుగుల సమతా మూర్తి ఆవిష్కరణ, చిన్నజీయర్

*108 దివ్యదేశ నమూనా ఆలయాలతో రామానుజ విగ్రహ ప్రాంగణం*  

*1035 కుండలాలతో 5000 ఋత్విక్ లతో లక్ష్మి నారాయణ యాగం* 

*స్వదేశీ ఆవుల నుంచి వచ్చిన నెయ్యి మాత్రమే వినియోగం.* 

*ఈమహా క్రతువులో పాల్గొనే సేవ చేసేందుకు అందరికీ ఆహ్వానం* 

*విస్తృత ప్రచారం కల్పించండి, అందరిని

ఆహ్వానించండి.* 

*రామానుజ తిరునక్షత్ర వేడుకల్లో చిన్నజీయర్ స్వామి ప్రకటన. 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*హైదరాబాద్, విశాఖపట్నం, ఏప్రిల్ 18, 2021 (డిఎన్ఎస్):* కోట్లాది మంది హిందూ సంప్రదాయ పరులు ఎంతగానో ఎదురుచూస్తున్న 216 అడుగుల భారీ రామానుజాచార్య స్వామి విగ్రహ ప్రాంగణం (

సమతా మూర్తి) ప్రారంభోత్సవాన్ని ఫిబ్రవరి 2022 లో జరుపుకోనున్నట్టు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర రామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. ఆదివారం భగవద్రామానుజుల 1004 తిరునక్షత్ర పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ లోని ముచ్చింతల్ లోని జీయర్ స్వామి ఆశ్రమం లోని దివ్య సాకేతం క్షేత్రంలో అత్యంత వైభవంగా

వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 216 అడుగుల భగవద్రామానుజ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ వైభవాన్ని పురస్కరించుకుని 1035 కుండాలతో శ్రీ లక్ష్మి నారాయణ మహాక్రతువు (యాగం) నిర్వహిస్తున్నామని, అదే సమయంలో శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లచే మంగళాశాసనం

చెయ్యబడిన, అత్యంత ప్రాధాన్యత కల్గిన 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను కూడా అదే ప్రాంగణం లో ప్రతిష్ఠా చేయడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలు 2022 ఫిబ్రవరి 2, నుంచి 14 వ తేదీ వరకూ జరుగుతాయన్నారు. 

వాలంటీర్లు కు ఆహ్వానం: 

భారీ ఎత్తున జరుగుతున్నా ఆ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకు దేశ విదేశాల

నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, హిందూ సంప్రదాయ పరులు హాజరవుతున్నట్టు తెలిపారు. వీరందరికి తగిన సహకారాన్ని అందించేందుకు, యాగ ఏర్పాట్లు, తదీయారాధన వితరణ, నుంచి అన్ని పరిసరాల్లోనూ సేవలు అందించేందుకు ఔత్సాహిక వాలంటీర్లు గా పాల్గొనవలసిందిగా స్వామి ఆహ్వానం పలికారు. రెండు నెలల పాటు ఈ యాగ నిర్వహణలో పాల్గొని, భాగస్వాములు

కావాలన్నారు. 

పూర్తి స్వదేశీ నెయ్యి మాత్రమే వినియోగం. . .

1035 హోమ కుండాల్లో వినియోగించే ఆవు నెయ్యి పూర్తిగా భారతీయ స్వదేశీ ఆవుల పాల నుంచి తీసినది మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నారు. జెర్సీ ఆవులు, హైబ్రిడ్ ఆవుల పాల నుంచి వచ్చిన నెయ్యి యాగ కుండాల్లో వినియోగించడం జరగదన్నారు. పూర్తిగా భారతీయ

స్వదేశీ ఆవుల నెయ్యి కోసం రాజస్థాన్ లోని పథమేడ నుంచి సేకరిస్తున్నట్టు తెలిపారు. స్వదేశీ ఆవు ల నుంచి తీసిన పాలను కాచి, చల్లార్చి, సంప్రదాయ పరంగా చిలికి వెన్నతీసి, వచ్చిన వెన్న కాచగా వచ్చిన ఆవునెయ్యిని మాత్రమే ఈ యాగం లో వినియోగించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రక్రియ ఆదివారం రాజస్థాన్ లో

ప్రారంభమయ్యిందన్నారు. 

*విస్తృత ప్రచారం కల్పించండి, అందరిని ఆహ్వానించండి.* 

న భూతొ న భవిష్యత్ అన్న రీతిలో జరుగనున్న ఈ మహా క్రతువుకు విస్తృత ప్రచారం కల్పించాలని, ఆధ్యాత్మిక పరులు, సంప్రదాయపరులు, యువతీయువకులు, అందరికీ ఆహ్వానం పలకాలని పిలుపునిచ్చారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam