DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ క్షేత్రమా. . . . కాదా?

*ఇంతకీ సింహాచలం లో వరాహ స్వామి ఉన్నాడా లేడా?*

*కొత్త పాలనలో వరాహుని పేరే కనుమరుగయ్యేలా ఉంది* 

*పాలక వర్గం క్షేత్ర చరిత్ర కాపాడాలి తప్ప మార్చరాదు : భక్తులు*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 23, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల

ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం లో ఇంతకీ వరాహ స్వామి ఉన్నాడా లేడా అనే సందేహం కలుగుతోంది. పురాణం కాలం లోని పురూరవ చక్రవర్తి కాలంలో వరాహ లక్ష్మి నృసింహునిగా సింహాచల గిరులపై ఆవిర్భవించిన స్వామి గత కొన్ని రోజులుగా కేవలం లక్ష్మి నృసింహునిగానే వినపడుతున్నాడు. ఈ ఆలయం పూర్తిగా ద్వయరూపం, అందరికి

దర్శనమిచ్చే ముఖ రూపం శ్రీ వరాహ రూపమే. , వెనుక భాగం లో సింహాకృతి వాలం, నడుం భాగం నుంచి మానవ రూపం అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఏకైక క్షేత్రం శ్రీ సింహాచల క్షేత్రం.  

అలాంటి  ఈ ఆలయం లో కొత్త పాలక మండలి, కొత్త అధికారులు రావడంతోనే గత కొన్ని రోజులుగా ఎన్నో మార్పులు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఆలయ వైభవాన్ని విశ్వ

విఖ్యాతం చేసేందుకు ప్రచార మధ్యమ సిబ్బంది ని ఏడాదికి రూ. 10 లక్షల వ్యయం వెచ్చించి నియామకం చేశారు. దీనిలో భాగంగానే ఆలయంలో జరిగే ప్రతి అంశాన్ని ఈ బృందం మీడియా ద్వారా తెలియచేసే ప్రయత్నం చేస్తోంది. ఈ బృందానికి ఆలయ వైభవం, ప్రాశస్త్యం, చారిత్రక ఆధారాలు, గత చరిత్ర దృష్ఠ్యంతలు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలియని పక్షం లో

తెలుసుకోవాల్సిన భాద్యత వీరిపై ఉంది. 
వీరి ద్వారా కేవలం స్థానిక మీడియా కు మాత్రమే కాక, విశ్వ విఖ్యాతంగా, ప్రపంచ దేశాలకు సైతం విస్తరింప చేస్తున్నారు. 

వీళ్ళు చేస్తున్న ప్రచారం లో లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం అని మాత్రమే  ప్రచారం లో వీళ్ళు వాడుతుండడం గమనార్హం. దీంతో ఈ అంశంపై పలు అనుమానాలు

వ్యక్తమవుతున్నాయి. 

నూతన కార్యవర్గ సమావేశంలో ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందా, దాని ప్రకారం అధికారగణం ఈ క్షేత్రాన్ని కేవలం లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం అని ప్రచారం చేస్తోందా అనే అభిప్రాయం కలుగుతోంది.

భక్తుల సూచన : 
పాలక వర్గాలు, అధికారులు కేవలం కేర్ టేకర్ గా మాత్రమే ఉంటాయి, ఉండాలి

తప్ప, ఆలయ చరిత్రను, ప్రాధాన్యతను మార్చేవిగా ఉండకూడదు. 

ఇక నుంచైనా సింహాచల క్షేత్రం లో వెలసిన మూల విరాట్ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి అని మాత్రమే వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam