DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగాల్లో కేంద్రమంత్రిపై గూండాల దాడి, మాజీ ఎమ్మెల్యే ఖండన

*మురళీధరన్ కాన్వాయ్ పై వెస్ట్ మిడ్నపూర్ లో దుంగలతో దాడి*

*తక్షణం కేంద్రం చర్యలు తీసుకోవాలి: విష్ణు కుమార్ రాజు వినతి*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 06, 2021 (డిఎన్ఎస్):* పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్ మిడ్నపూర్ లో పర్యటిస్తూన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ

సహాయ మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఇంఛార్జి మురళీధరన్ కాన్వాయ్ పైన గురువారం బెంగాల్ లో గూండాలు పెద్ద పెద్ద దుంగలతో, రాళ్లతో దాడి చేసిన ఘటనపై విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు తీవ్రంగా ఖండిస్తు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. 
ఒక కేంద్రమంత్రి

పరిస్థితి ఇలా ఉంటే, బెంగాల్ లో సామాన్య ప్రజలకు మమత బెనర్జీ గూండాల నుండి అసలు రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. బెంగాల్ లో బీజేపీ పార్టీ నాయకుల పై జరిగిన దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో

ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర  ప్రభుత్వం పై కూడా ఉందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam