DNS Media | Latest News, Breaking News And Update In Telugu

7 న సంపత్ వినాయక ఆలయంలో  ధన్వంతరి హోమం

*కొరోనా కట్టడి కోసం ఆలయంలో హోమం: ఏసీ శాంతి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 03, 2021 (డిఎన్ఎస్):*  కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులలో కరోనా వ్యాప్తి నివారణకు  ప్రజలను కరోనా మహమ్మారి బారి నుండి రక్షించుటకు విశాఖపట్నం, ఆశీలమెట్ట, శ్రీ సంపత్ వినాయగర్

దేవస్థానము లో ఈ నెల 7 వ తేదీ ధన్వంతరి, మృత్యుంజయ  హోమం నిర్వహిస్తున్నట్టు దేవాలయ  కార్యనిర్వాహణ అధికారిణి,  విశాఖపట్నం సహాయ కమిషనర్, శాంతి కాళింగిరి తెలియచేసారు. విశాఖనగరంలోనే అత్యంత ప్రసిద్ధికెక్కిన ఈ దేవాలయంలో భక్తుల సంరక్షణార్థం ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల అదేశముల మేరకు ఈ దేవాలయంలో

ప్రజా రక్షణార్థం సోమవారం ఉదయం 7 గంటలనుండి  9 గంటలవరకు ధన్వంతరి, మృత్యుంజయ  హోమం  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతముగా నిర్వహించబడుతుందని తెలిపారు. 

భక్తులoదరూ పరోక్షంగా ఈ కార్యక్రంలో పాల్గొనుటకు ఈ క్రింది తెలిపిన గూగుల్ మీట్ (https://meet.google.com/nko-ramz-rpc ) లింకు ద్వారా ప్రత్యక్ష ముగా వీక్షించవచ్చని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam