DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ బాధిత జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

*ఏఐఎన్ఈఎఫ్ ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రరావు.*

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 07, 2021 (డిఎన్ఎస్):*  ఆంధ్రప్రదేశ్ లో 60 కి పైగా జర్నలిస్టులు కోవిడ్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారని, వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్

ఈ ఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు చలాది.పూర్ణచంద్ర రావు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తిచేశారు. వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా (ఏపీజేయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధాన అతిది గా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పొరుగు

రాష్ట్రాలయిన ఒరిస్సా, తమిళనాడులలో కోవిడ్ వైరస్ కి మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 10 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తు, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించిన  ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, స్టాలిన్ లకు, అలాగే ఇప్పటికే గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్ణచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు.
వెంటనే ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం కూడా  కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కరికి 10 లక్షలు పరిహారం చెల్లించి, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పత్రికా యాజమాన్యాలకు అనుగుణంగా పనిచెయ్యలసిన పాత్రికేయులకి వారి వృత్తే తప్ప వేరే వివరాలతో పనిలేదని కనుక ప్రభుత్వం పెద్దమనసుతో జర్నలిస్టులకు అన్ని రాయితీలు వెంటనే

మంజూరు చేయాలని కొరారు.
ఏపీజేయూ అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు (నెల్లూరు) మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అక్రిడేషన్లు జారీలో తీవ్ర జాప్యం జరిగి బస్, రైల్ పాస్ లు, గ్రూప్ ఇన్సూరెన్స్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం లు పొందలేకపోయారని, వెంటనే ప్రభుత్వం వీటిని మంజూరు చేసి జర్నలిస్ట్స్ ని అదుకోవాలన్నారు.
/>  గతంలో ఎప్పుడు ఇలా జాప్యం జరగలేదని, విధి నిర్వహణకు బయటకు వెళ్లాలంటే పోలీసులు కర్ఫ్యూ పాస్ లేదా అక్రిడిటేషన్ కార్డులు అడుగుతున్నారని అవి ఇంతవరకు జారీ కానందున భారీగా పెనాల్టీలు కట్టవలసి వస్తోందన్నారు. మీట్ యాప్ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పి.రాజా, అదనపు ప్రధాన కార్యదర్శి (తూర్పు గోదావరి), ఇతర జిల్లాల

ప్రతినిధులు పాల్గొన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam