DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి తో సీఎం జగన్‌ చర్చ

*ధర్మేంద్ర ప్రధాన్‌ తో చర్చల్లో కాకినాడ పెట్రో కాంప్లెక్స్ అంశం*

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 11, 2021 (డిఎన్ఎస్):* కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో

కలుసుకున్నారు. గంటకుపైగా ఇరువురి మధ్య జరిగిన సమావేశం జరిగింది. ప్రధానంగా చర్చ కు వచ్చిన అంశాలు. 
 కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై చర్చ
– కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. 
– హెచ్‌పీసీఎల్‌ –

గెయిల్‌ సంస్థలు కలిసి 1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రూ. 32,900 కోట్లు ఖర్చుకాగల ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేశాయి. 
– వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రం కోరిందని తెలిపిన సీఎం.
– ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారం మోయలేమన్న

ముఖ్యమంత్రి. 
– ప్రాజెక్టు విధివిధానాలపై చర్చించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్‌ గ్రూపు కోసం సభ్యులను నామినేట్‌ చేశామని, కేంద్ర కూడా చర్చలు ప్రారంభించేలా వెంటనే ఆదేశాలు జారీచేయాలని కోరిన ముఖ్యమంత్రి. 
– కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25శాతం తగ్గించిందని, అలాగే

ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు కూడా తగ్గాయని వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌తో నిమిత్తంలేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించిన సీఎం. 
– వెంటనే దీనిపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేసిన సీఎం.

– విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని

కేంద్రమంత్రి ప్రధాన్‌ను కోరిన సీఎం.
– స్టీల్‌ ప్లాంట్‌ వల్ల దాదాపు 20వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధిపొందుతున్నారన్న సీఎం.
– విశాఖ ఉక్కు ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల త్యాగాల పునాదులమీద ఈ ఫ్యాక్టరీ వచ్చిందని తెలిపిన సీఎం.
– 2002–15 మధ్య

స్టీల్‌ప్లాంట్‌‌ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని తెలిపిన సీఎం. 
– స్టీల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19700 ఎకరాల భూమి ఉందని, దీనివిలువ దాదాపు రూ. లక్ష కోట్లపైనేనని తెలిపిన సీఎం.
– స్టీల్‌ ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉందని, విస్తరణకోసం వివిధ

బ్యాంకులనుంచి రుణాలు తీసుకుందని, ఇదే సమయంలో అంతర్జాతీయం ఉక్కు పరిశ్రమకు వచ్చిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచి స్టీల్‌ ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపిన సీఎం.
– సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చుకూడా విపరీతంగా పెరిగిపోయిందన్న సీఎం.
– ప్లాంటు పునరుద్ధరణకోసం పలు ప్రత్యామ్నాయాలు

సూచించిన సీఎం. 
– స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని, అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్పులు చేయాలని, రుణాలను ఈక్విటీగా మార్చాలని కోరిన సీఎం. 
– 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ 6.3 మిలియన్‌  మెట్రిక్‌ టన్నుల వార్షిక

సామర్థ్యంతోనే పనిచేస్తోందని, డిసెంబర్‌ 2020 నుంచి నెలకు రూ.200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని తెలిపిన సీఎం. ఇది ఇలాగే రెండేళ్లపాటు కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న సీఎం. 
– విశాఖస్టీల్‌ప్లాంట్‌ ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుంచి బైలదిల్లా గనులనుంచి మార్కెట్‌ధరకు కొనుగోలు చేస్తోందని, టన్ను

సుమారు రూ.5,260 కు కొంటోందన్న సీఎం. 
– పోటీ కంపెనీలు 60శాతం ఇనుప ఖనిజాన్ని సొంతగనుల నుంచే పొందుతున్నాయని, కావాల్సిన మిగతా ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుంచి కొంటున్నాయన్న సీఎం.
– సెయిల్‌కు సొంతంగా 200 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్న గనులు ఉన్నాయని తెలిపిన సీఎం. 
– మార్కెట్‌ధరకు కొనుగోలు చేయడం వల్ల విశాఖ

స్టీల్‌ ప్లాంట్‌పై రూ. 3,472 కోట్ల అదనపు భారం పడుతోందని వెల్లడించిన ముఖ్యమంత్రి. 
– ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలని తెలిపిన సీఎం.
– విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.22వేల కోట్ల రుణాలు ఉండగా, వీటిపై 14శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తోందన్న సీఎం. ఈ రుణాలను

ఈక్విటీ రూపంలో మార్చాలని కోరిన సీఎం. స్టాక్‌ ఎక్సేంఛీలో నమోదు ద్వారా బ్యాంకులు తమ షేర్లు అమ్ముకునే అవకాశాలను పరిశీలించాలన్న సీఎం.
– తెలుగు ప్రజలకు  గర్వకారణమైన, రాష్ట్రానికి మకుటం లాంటి ఈ కంపెనీని కాపాడుకునే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సీఎం.
– కరోనా రెండో వేవ్‌

సందర్భంలో 7వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అందించిందని, లక్షలమంది ప్రాణాలు కాపాడిందని తెలిపిన సీఎం. 

–ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
– వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్‌ సానుకూలత

చూపారు. 
– వచ్చేవారం ఏపీ చీఫ్‌ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam