DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం చైర్మన్ నియామకంపై హైకోర్టులో ప్రభుత్వానికి మరో షాక్ 

*మాన్సాస్, సింహాచలం చైర్మన్ గా సంచయిత నియామకం చెల్లదు*

మాన్సాస్ సంస్థ బై లా కు విరుద్ధంగా నియామకం. 

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 14, 2021 (డిఎన్ఎస్):* మాన్సాస్ (మహారాజ అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్) సంస్థ నియమావళి కి విరుద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిగినా

చైర్మన్ నియామకం చెల్లదంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. ఈ నియామకం పై మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ పూర్వ చైర్మన్ దాఖలు చేసిన వ్యాజ్యం పై  సోమవారం కోర్టు ఆదేశాలు విడుదల చేసింది. దీంతో తిరిగి పి అశోక్ గజపతిరాజు మెన్సస్ ట్రస్ట్, సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం చైర్మన్ గాను భాద్యతలు

చేపట్టే అవకాశం ఉంది.  
 
గతంలో చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి, ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను విడుదల చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు లో సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచింది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam