DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల ఆలయం పైనే అపచారానికి మ్లేచ్చుల దాడి కుట్ర...   

*అర్చకుల మంత్రాలూ మార్చి, క్రైస్తవ పాటలు మార్ఫింగ్*

*ఆలయ అధికారిక వీడియోనే మార్ఫింగ్, చేస్తే ఠికాణా లేదా?* 

*దురాగతాలు అడ్డుకోడం చేతకాకుంటే ఈఓ తప్పుకోవాలి* 

*ఆలయ పిఆర్ఓ పంపిన వీడియోలు బయటకు ఎలా వెళ్లాయి?*  

*విశ్వహిందూ పరిషత్ యువ నేత విజయ్ ఫణి మండిపాటు*   

*(DNS report :

Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 24, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం పైనే నేరుగా క్రైస్తవ మత ప్రచారక ముఠా దాడి చేశారు. ఘాతకుల దురాగతం పై విశ్వ హిందూ పరిషత్ బృందం, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గురువారం సింహాచలం తోలి పావంచా వద్ద నిర్వహించిన

నిరసనల్లో విశ్వ హిందూ పరిషత్ యువ నేత విజయ్ శంకర్ ఫణి మాట్లాడుతూ సింహాచల అర్చకులు పాడిన మంత్రాలను తొలగించి, క్రైస్తవ పాటలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో విడుదల చేశారన్నారు. తక్షణం ఈ ఘాతకులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఈవో కార్యాలయం వద్ద నిరసనలు చేస్తామని  హెచ్చరించారు. దేవస్థానం లో ఎవరికీ తెలియకుండా ఈ దుశ్చర్య

జరగదన్నారు. 

ఇటీవలే సింహాద్రినాధుని సన్నిధిలో వార్షిక  కల్యాణం లో గరుడ ఉత్సవం లో ఆలయ ఉపప్రధాన అర్చకుడు, అలంకారి భండారి కర్రీ  సీతారామాచార్యులు జాతులు పాడడం జరిగింది. దీన్ని ఆలయ అధికారిక మీడియా కమిటీ వీడియో చిత్రీకరించి, మీడియా కు విడుదల చేసింది. 
ఈ వీడియో లోని అర్చకుని మాటలు తొలగించి, క్రైస్తవ

పాటలు మార్ఫింగ్ చేసి సోషల్  మీడియా లో విడుదల చేసారు. దీనిపై ఆలయంలో రాద్దాతం ఆవుతోంది. దీంతో భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.

రాజకీయాల పై సోషల్ మీడియా లో వ్యాఖ్యలు చేస్తే జైళ్లల్లో పడేస్తున్నారని, అలాంటిడి  కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా  హిందూ దేవాలయం పై క్రైస్తవ

మతప్రచార ఘాతకులు మార్ఫింగ్ చేస్తే. . .జైలుకి పంప వద్దా అని  మండి పడ్డారు.  ఈ విధమైన క్రైస్తవ దుర్మార్గాలు అరికట్టడం చేతకాక పొతే ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారు. 

మీడియా కమిటీ సమాధానం చెప్పాలి : 

ఈ దుర్ఘటన పై ఆలయ మీడియా కమిటీ సమాధానం చెప్పాలని విశ్వ హిందూ పరిషత్

డిమాండ్ చేసింది. 

ప్రస్తుతం సింహాచలం దేవస్థానం గుడి ప్రాంగణం లోకి ఏ ఇతర మీడియా ప్రతినిధులకు ఫోటోలు గానీ, విడదేమో గానీ తీసేందుకు అనుమతి లేదు. ఈ విధంగా ఈఓ ఎం వి సూర్య కుమారి ఆదేశాలు జారీ చేసారు. దేవాలయం లో ప్రత్యేకంగా 
పి ఆర్ ఓ ను ( రూ. 50 వేలు),  ఒక వీడియో / ఫోటోగ్రాఫర్ ను ( రూ. 25 వేలు నెలకు జీతం )    ఇచ్చి

నియమించారు. దీంతో ఇతర మీడియా సంస్థలకు రాజగోపురం దాటి లోపలకు అనుమతి లేదన్నారు. 

ఆలయంలో జరిగే కార్యక్రమాల ఫోటోలు, వీడియో లను కేవలం ఆలయ మీడియా టీమ్ మాత్రమే స్థానిక పత్రికలకు, టీవీలకు పంపుతున్నారన్నారు. ఇది నిత్యా కళ్యాణం  ఆక్వాడంతో ప్రింట్ మీడియా వర్గాలు వీడియో లు వాడవని, తక్కువ క్వాలిటీ ఉండే ఈ వీడియో లను

టీవీల వారుకూడా వాడుకునే ఆవకాశం తక్కువ అన్నారు. అయితే ఇదే వీడియో క్రైస్తవ ఘాతకులకు ఎలా వెళ్ళింది అనేది తేల్చాల్సిన బాధ్యత ఆలయ ఈఓ పైనే ఉందన్నారు.  

ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడంతో పాటు, ఏకంగా గూళ్ళల్లోనే  అన్యతమత ప్రచారం జరుగుతున్నా పాలకులు, దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

కళ్ళుమూసుకున్నారని మండిపడ్డారు. గత రెండేళ్ళ కాలంలో సుమారు 130 కి పైగా  హిందూ ప్రార్ధన స్థలాల్లో  దాడులు జరిగితే పట్టింపులేని పాలకులు నీతి కబుర్లు చెప్తున్నారన్నారు. 2019 లో అంతర్వేది ఆలయ రధం తగలెబెడితే నేటికీ ఘాతకులను అరెస్ట్ చేయకపోగా, ఆ సమయంలో ఆ గుడి కి ఈఓ గా ఉన్నవ్యక్తికి పదోన్నతి కల్పించిన  ఘనత వైఎస్ జగన్

ప్రభుత్వానిదేనన్నారు. 

పిఠాపురం లో 40 దేవత విగ్రహాలు కూల్చినా పట్టింపు లేదని, రామ తీర్ధం లో రాముని విగ్రహాన్ని శిరస్సు ఛిద్రం చేస్తే. .నేటికీ ఠికానా లేదన్నారు. తిరుమల ఆలయ గోడలపై విద్యుత్ అలంకరణ శిలువలా ఉంది అని ఒకరు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే. . అతనిని  మూడు నెలల పాటు జైల్లో చిప్ప కూడు తినిపించారన్నారు.

అలాంటిది ఏకంగా ఆలయంలోపలే జరిగిన కార్యక్రమానికి మార్ఫింగ్ చేస్తే పట్టింపులేదన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam