DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నోటిసు ల్లేకుండా ఎన్ఏడి శివాలయం ప్రాంగణం కూలుస్తారా? 

*జివిఎంసి పై విహెచ్పి నేత విజయ్ ఫణి మండి పాటు.* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 05, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో గుళ్ల పై దాడులకు పాల్పడిన ఘటనల పై  ప్రభుత్వం  ఏ మాత్రం చర్యలు తీసుకోక పోవడం నేడు ఏకంగా దేవాదాయ శాఖా గుడి ప్రాంగణాన్ని అధికారులు కూల్చేసి స్థితికి వచేశారని

విశ్వహిందూ పరిషత్ యువ కార్యకర్త విజయ్ శంకర్ ఫణి మండిపడ్డారు. విశాఖపట్నం రద్దీ కేంద్రమైన ఎన్ ఏ డి కూడలి వద్ద రోడ్డు విస్తరణ కోసం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా శ్రీ ప్రమథ విశ్వేశ్వర కుమారస్వామి దేవాలయంలోని ధ్వజస్థంభం దాటి ప్రాంగణాన్ని కూల్చేశారు. దీనిపై దేవాదాయ శాఖా ఆలయ ఈఓ ఇంతవరకూ స్పందించక పోవడంపై భక్తులు

మండిపడుతున్నారు. 

రోడ్డు విస్తరణ కోసం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి పొందిన కాంట్రాక్టర్ సోమవారం ఉదయం ఈ దేవాలయ ప్రాంగణాన్ని తవ్వేయ్యాడం తో భక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కాంట్రాక్టర్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆలయంలోని ప్రహరీ ని కూల్చి వెయ్యడమే కాక ధ్వజస్తంభాన్ని కూడా

కూల్చేసినట్టు మండిపడుతున్నారు. 
సోమవారం కావడం తో గుడిలో భక్తులు ఉండగానే సుమారు నాలుగు అడుగుల లోటు గోతులు త్రవ్వేసారు. దీంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. 
దీంతో స్థానిక విశ్వ హిందూ పరిషత్ నేతలు విజయ్ శంకర్ ఫణి, జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ తదితరులు అక్కడికి చేరుకొని ఈఓ గురించి విచారించినా

సమాచారం లేకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్ ను నిలదీసి తక్షణం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam