DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలకుల వైఫల్యమే కబేళాల్లో లక్షల్లో గోవధలకు చేరుతున్నాయి

*గోవధ నిషేధ, సంరక్షణ చట్టం 1977చట్టం ఇదే చెప్తోంది* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్)* గోవుల అక్రమ తరలింపు, సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చెయ్యడంలో పూర్తి నిర్లక్ష్యం వహించడంతో ప్రతి రోజూ లక్షలాది గోవులు అక్రమ మార్గాల్లో కబేళాలకు తరలిపోతున్నాయి. 

ఇటీవల

కాలంలో గోవుల అక్రమ రవాణా, కబేళాల కు తరలింపుపై గోరక్షణ బృందాలు విస్తృతంగా పోరాటం చేస్తున్న తరుణంలో తెలంగాణాలో అక్రమ రవాణా పెరిగిపోయాయి. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గోవధ నిషేధ & పశు సంరక్షణ చట్టం 1977 వివరించే అంశాలు ఇవే. . .  

1) Section - 5 : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో గోవులను, దూడలను (దూడలు

మగవి అయినా , ఆడవి అయినా సరే) ఎట్టి పరిస్థితులలో ఉద్దెశపూర్వకంగా  చంపకూడదు.
2) Section - 6 : మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న, గేదె మొదలైనవాటిని చంపాలంటే , వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి వుండాలి, అలాగే వ్యవసాయం కి మరియు బ్రీడ్ డెవలప్మెంటకి పూర్తిగా నిరుపయోగంగా వున్నాయని, ప్రభుత్వము నియమించిన పశు వైద్యుడు

సర్టిఫికేట్ ఇవ్వాలి.
౩) Section - 8 : ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వ అనుమతి వున్న కబేళా (పశువధశాల)లలో మాత్రమే వధించాలి, రోడ్డులపై, ఇండ్లల్లో, ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం, మాంసాన్ని విక్రయించడం నేరము. 
4) Section - 11 : ఈ యొక్క యాక్ట్ కాగ్నిజబుల్ (Cognizable) నేరం కింద వస్తుంది
( CRPC 43 )
 సిర్ పిసి 43 :-
/>  ప్రకారం ఎప్పుడైనా కాగ్నిజబుల్  (Cognizable) నేరం జరిగినప్పుడు, ఎవ్వరైనా ప్రైవేట్ పర్సన్ (Private Person) అనగా మనం, నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది, 
కావున గో వధ అనేది కూడా కాగ్నిజబుల్ (Cognizable) నేరం కింద వస్తుంది,  కావున గో వద చేసే రవాణా ని అడ్డుకొని అరెస్ట్ చేసే హక్కు ప్రతి ఒక్క ప్రైవెట్ పర్సన్ అనగా పౌరుడికి

వుంది అనగా ఏ వ్యక్తి అయినా ఆపొచ్చు తర్వాత పోలీస్ వాళ్లకు అప్పగించాలి
( Animal Cruelty Act 1960 )
 అనిమల్ క్రూయల్టీ యాక్ట్ 1960 : 
1) Section - 11 : హింసిస్తూ, దెబ్బలు తాకుతూ, గాలి ఆడకుండా, రక్తం వచ్చేటట్టు కట్టేయడం, ఓవర్ లోడ్ చేస్తూ, నొప్పులతో ఇబ్బంది పెడుతూ తీసుకెళ్లడం నేరం
( A.P. & T.S. Motor Vehicle Rules 1989, Rule 253 Sub Rule (1), Clause (iii) ) 
 ఏ.పి & టి.ఎస్ మోటార్

వెహికల్ రూల్స్ 1989, రూల్ 253 సుబ్ రూల్(1) క్లాస్ (iii) 
పశువుల రవాణాకు
ప్రకారం నియమాలు:-
1) a) ఒక లారీలో 06 కంటే ఎక్కువపశువులను రవాణా చేయకూడదు.
b) ఈ 06 కూడా రవాణా చేస్తున్న సమయములో, పశువైద్యుడి ధ్రువపత్రాన్ని కలిగి వుండాలి.
c) వాహనములో పశువులతోబాటు, వాటి బాగోగులు చూసుకునే వ్యక్తి (attedent) వుండాలి.
d) ప్రధమ చికిత్స పెట్టె (First Aid

Box) వుండాలి.
e) మేత, నీరు వుండాలి.
f) మూసివేయబడి ఉన్న వాహనాల్లో (Closed Containers) పశువులను తరలించకూడదు.
 ( IPC 428 & IPC 429 )  ఐపిసి 428 & ఐపిసి 429 ప్రకారం 
1)పశు రవాణా సమయం లో ఏదైనా పశువు అనగా ఆవు లేదా ఎద్దు చనిపోతే ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయించాలి,
ఈ సెక్షన్స్ జోడించినచొ 2 లేదా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, కావున తప్పకుండ ఈ

సెక్షన్స్ వేసేటట్టు చూడాలి 
అక్రమ గోవుల రవాణా వాహనాలు  మనకు కనబడగానే వాటిని ఆపి 
100 కి కాల్ చేసి, పోలీస్ వారికి తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాలి. 
పోలీస్ వాళ్లు పట్టుకున్న గోవులను, సురక్షితంగా రిజిస్టర్ అయినా గోశాలకు తరలించాలి  
అక్రమ రవాణా చేస్తున్న వారి మీద, అమ్మినవారి మీద, కోన్నవారి మీద, శిక్ష

పడేలా FIR కేసు వేయించాలి


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam