DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవుల తరలింపు పై చర్యలు తప్పవు:తెలంగాణ డిజిపి 

*గోవధలు అడ్డుకోకుంటే. గ్రేటర్ లో గోబంద్ తప్పదు: యువతులసి*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్)* 

*హైద్రాబాద్ / విశాఖపట్నం, జులై 06, 2021 (డిఎన్ఎస్):* ఇటీవల కాలంలో గోవుల అక్రమ రవాణా, కబేళాల కు తరలింపు పై గోరక్షణ బృందాలు విస్తృతంగా పోరాటం చేస్తున్న తరుణంలో తెలంగాణాలో అక్రమ రవాణా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హైద్రాబాద్

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె శివ కుమార్ లు డిజిపి మహేంద్ర రెడ్డి కి చేసిన విజ్ఞప్తుల మేరకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్టు డిజిపి తెలిపారు. గో వధ లను అడ్డుకోకుంటే. . భాగ్యనగరం దిగ్బంధం చేస్తామని యుగ తులసి శివ కుమార్ ముందుగానే హెచ్చరించారు.   

ఆవులను, లేగ దూడలను మరియు

ఒంటెలను వదించడము Cow slaughter and Animal Prevention Act-1977 ప్రకారము నిషేదించబడినది. కావున ఆవులను/ లేగదూడలను/ ఒంటెలను ఎవరైనా అక్రమంగా తరలించినా లేదా అక్రమ రవాణాను ప్రోత్సహించినా లేదా వధించినా సంబందిత వ్యక్తుల పై  చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడము జరుగుతుంది. 
• జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిదులలోని పోలీస్ అధికారులు ఈ అక్రమ

రవాణా ను నివారించుట కొరకు సంతలలో ప్రత్యేక నిఘా ఉంచడము జరిగినది, అదే విధంగా జిల్లా సరిహద్దుల వెంబడి కూడా పోలీస్ మరియు వెటర్నరి అధికారులు సంయుక్తంగా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి ఆవులు, లేగ దూడల అక్రమ రవాణా నియంత్రనకోసం 24*7 ప్రత్యేక తనికీలు నిర్వహించడం జరుగుతుంది.
• ఒక వెళ ఎవరైనా పశువులను  సంతలో కొని రవాణా

చేయదలచినట్లయితే సంబంధిత వెటర్నరీ డాక్టర్ గారి చేత ఆరోగ్య మరియు రవాణాకు అనుమతి పత్రాలు తీసుకొని, రవాణా సమయంలో వెంట తీసుకొని రావలెను. అలా కాకుండా ఎవరైనా చట్టవ్యతిరేకంగా ఆవులను/ లేగదూడలను/ ఒంటెలను తరలించినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడము జరుగుతుంది.
• ఆవులు, లేగ దూడల అక్రమ రవాణాకు సంబంధించి

ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటారు. అంతే కానీ ఎవరూ కుడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడులకు పాల్పడితే అక్రమ రవాణాకు పాల్పడిన వారితో పాటు, దాడులు చేసిన వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు

తీసుకోవడం జరుగుతుంది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam