DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్య సాయి ట్రస్ట్ కు ఏపీ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక పురస్కారం 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 09, 2021 (డిఎన్ఎస్):* శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ కు ప్రతిష్టాత్మక జీవితకాల సాధన పురస్కారాన్ని ప్రకటించినందుకు ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్య మంత్రి  వై ఎస్ జగన్ మోహన రెడ్డి కి, AP ప్రభుత్వానికి సంస్థ మేనేజింగ్ ట్రస్టీ, ఆర్. జె.రత్నాకర్ 
ధన్యవాదాలు తెలిపారు.

 కుల, మతాలతో సంబంధం లేకుండా సమాజానికి చేస్తున్న గొప్ప సేవకు గుర్తింపుగా శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు ఆంధ్రప్రదేశ్ "జీవిత సాఫల్య పురస్కారం" ప్రకటించడం పట్ల   ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఇంతకూ ముందు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (ఇకోసోక్) శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్సిటి) కు అసమానమైన

మానవతా కృషికి ప్రత్యేక సంప్రదింపుల హోదా ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇచ్చింది.
 
ఐక్యరాజ్యసమితి యొక్క ఆర్ధిక మరియు సామాజిక మండలి (ECOSOC) అంతర్జాతీయ ఆర్థిక మరియు సామాజిక సమస్యలపై చర్చించడానికి మరియు సభ్య దేశాలకు మరియు ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు ఉద్దేశించిన విధాన సిఫార్సులను రూపొందించడానికి కేంద్ర

వేదికగా పనిచేసే ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు ప్రధాన విభాగాలలో  ఒకటి.
 
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్‌కు ఇచ్చిన ప్రత్యేక సంప్రదింపుల ప్రత్యేక హోదా  ECOSOC మరియు దాని అనుబంధ సంస్థలతో పాటు ఐక్యరాజ్యసమితి సచివాలయం, కార్యక్రమాలు మరియు ఏజెన్సీలతో అనేక విధాలుగా చురుకుగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. శ్రీ సత్య

సాయి సెంట్రల్ ట్రస్ట్  గత అనేక దశాబ్దాలుగా చేస్తున్న సమాజ సేవ తదితర అంశాల మీద   ఐక్యరాజ్యసమితికి ప్రాతినిధ్యం వహించగలదు మరియు సలహాలను ఇవ్వగలదు.

ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ అవలంబించిన 5 ఉత్తమ పద్ధతులను అనగా శ్రీ సత్య సాయి విలువ ఆధారిత సమగ్ర

విద్యా కార్యక్రమాలు, ఎస్ఎస్ఎస్ మెడికల్ మిషన్, ఎస్ఎస్ఎస్సిటి తాగునీటి ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎస్ఎస్ఎస్ విద్యా వాహిని కార్యక్రమం శక్తితో కూడిన బోధన, SSSCT సౌర విద్యుత్ ప్రాజెక్టులను  UN 2030 ఎజెండా మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉండటం తో వాటిని ఆమోదింకడమే కాకుండా శ్రీ సత్య సాయి

సెంట్రల్ ట్రస్ట్ అవలంబించిన 5 ఉత్తమ పద్ధతులను  తమ అధికారిక వెబ్‌సైట్‌లోని  హైలైట్ చేశాయి.

ఇటీవల, నీతి అయోగ్ “భారతదేశంలో లాభాపేక్షలేని హాస్పిటల్ మోడల్” పై చేసిన అధ్యయనంలో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న సేవలను  గుర్తించి మద్దతు ద్వారా శ్రీ సత్య సాయి సెంట్రల్

ట్రస్ట్ కు ఎక్కువ రాయితీలు. ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ఈ ప్రత్యేక అవార్డు యావత్  శ్రీ సత్య సాయి సేవా సంస్థల సభ్యులందరికీ, భక్తులకూ, దాతలకు అంకితమని తెలిపారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam