DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్కాటక రాశిలోకి రవి ప్రవేశంతోనే దక్షిణాయణం ఆరంభం 

*మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే కాలం, చాతుర్మాస్యం*   
 
*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 16, 2021 (డిఎన్ఎస్):* సూర్య భగవానుని గమనం ప్రకారం సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరిస్తూ కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. జులై 17 శనివారం నుంచి ఆరంభమయ్యే ఈ కాలం

రానున్న ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఈ కాలయంలోనే సన్యాసులు, యతులు, చాతుర్మాస్య దీక్షను ఆచరించనున్నారు. 

భారత సనాతన వైదిక సంప్రదాయంలో కాలగమనం ప్రకారమే దిన, రాత్రి, తిధి, నక్షత్ర, రాశి తదితరములు లెక్కించడం జరుగుతుంది.  ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి గమనాన్ని మన పూర్వీకులు యుగాలుగానూ, యుగాలను

సంవత్సరములుగానూ, సంవత్సరములను మాసములుగానూ, మాసములను వారములుగానూ, వారములను రోజులుగానూ, రోజులను జాములుగానూ, జాములను ఘడియలుగానూ ఇలా అనేక విధములుగా సమయాన్ని కాల గమనాన్ని తెలుసుకునేందుకు విభజించియున్నారు.

సంవత్సరంలోగల 12 మాసములను రెండుగా విభజించి ఆయనములు అని పేరు పెట్టారు. మొదటిది ఉత్తరాయణం. సూర్య

భగవానుడు మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది.  

ఉత్తరాయణం - దీన్ని మనం చాల తేలికగా కనిపెట్టవచ్చు! సూర్య భగవానుడు ఉత్తరం వైపు నుండి ఉదయిస్తాడు! అంటే తూర్పు వైపు మీరు నుంచుంటే ఎండ వల్ల మీ నీడ మీ కుడివైపు పడుతుంది!

గమనించండి! 

దక్షిణాయణం - అంటే దక్షిణం వైపునుండి ఉదయిస్తాడు! ఇప్పుడు మీ నీడ ఎడమ వైపు పడుతుంది! ఇది దక్షిణాయణం! 

ఆంగ్ల క్యాలండర్ ప్రకారం ప్రతి జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 
16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు.

దక్షిణాయనం లో దేవతలు నిద్రిస్తారు. ఆ

సమయంలో మనకి పండగలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మనం చేసే పూజలు దేవతలకి శక్తులు ఇస్తాయి (మనం అలసిపోయి పడుకుంటే విశ్వ శక్తి మనలో ప్రవేశించి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసే పూజలు వారికీ అలా శక్తిని ఇస్తాయి). ఉపనయనం నిషిద్ధ కాలం ఇది, యతులు, సన్యాసులు నాలుగు నెలల చాతుర్మాస్య దీక్షను సాగించేది ఈ కాలంలోనే. 
 
/> ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు. ఆ సమయంలో దేవతలు మనకి అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. 

ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. 
మానవమాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు

ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి అన్నమాట.  

మన పూర్వీకులు తెలిపిన సరళ భాషలో తెలిపిన విధానాన్ని బట్టి సూర్య భగవానుని గమనాన్ని రెండు భాగాలుగా విభజించారు .

సూర్య భగవానుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయణం అని పేరు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam