DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్లిష్టమైన చాతుర్మాస్య దీక్షతో మహోన్నత ఫలితం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 22, 2021 (డిఎన్ఎస్):* చాతుర్మాస్య దీక్ష. . .ఈ పేరు వినగానే కేవలం సన్యాసాశ్రమం లో ఉన్నవారు మాత్రమే నిర్వహించే వ్రతం అనే భావనలో ప్రస్తుతం వైదిక  సమాజం ఉంది. అయితే ఈ దీక్ష ను అన్ని ఆశ్రమాల ( బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస )  వారు పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు కానీ,

లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ నాలుగు నెలల కాలం కొనసాగుతుంది. పూర్వకాలంలో సమాజంలోని అన్ని వర్గాల వారూ పాటించడం జరిగేది. అయితే కాలక్రమేణా, పాశ్చాత్య పోకడల ప్రభావంతో గృహస్తులు, ప్రజలు ఈ

దీక్ష ను దూరం పెట్టడం జరిగింది. కేవలం సన్యాశ్రమం లో ఉన్న వారు మాత్రం పాటించడం జరుగుతోంది.  వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.
అసలు ఈ దీక్ష ఎందుకు  చేపట్టాలి ?

ఆషాడ శుద్ధ ఏకాదశి లేదా పౌర్ణమి  నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి లేకా పౌర్ణమి వరకూ నాలుగు నెలల కాలం

జరిగే ఈ సమయం వర్షాకాలం కావడంతో సంచారానికి ఇబ్బంది కలుగుతుంది.  ప్రధానంగా సన్యాసులు, యతులు ఒక ప్రాంతంలో నివాసం ఉండరాదు, సంచారం చేస్తూ ధర్మ ప్రచారం చెయ్యాల్సి ఉంటుంది. వర్ష కాలం లో సంచరిస్తే. . .ఇబ్బందులు ఉంటాయి అనే ఒక కారణం వాళ్ళ ఈ కాలం లో ఒకే చోట నివాసం ఉంది, దీక్ష గా ఆధ్యాత్మిక గ్రంథ అనుసంధానం చేస్తూ, స్థానిక ప్రజలకు

హితబోధలు చేస్తుంటారు. 
ఈ కాలం లో దీక్షా నియమాలు, ఆహార నియమాలు కఠినంగానే ఉంటాయి. 

ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. 
ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.
ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని

అక్షరలక్షలుగా జపించాలి.
వేదం, ఉపనిషత్తులను పఠించాలి. పురాణం పఠనం, భగవద్గీతలోని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. 
యోగసాధన చేయడం శ్రేయస్కరం.
దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.

ఆహార నియమాలలో భాగంగా  : . .. 

మొదటి నెలలో  (ఆషాఢం - శ్రావణ మాసంలో ) ఆకుకూరలను, 
రెండవ నెలలో  ( శ్రావణ - భాద్రపద

మాసంలో ) పెరుగును 
మూడవ నెలలో ( భాద్రపద - ఆశ్వయుజ మాసంలో ) పాలను 
నాల్గవ నెలలో  ( ఆశ్వయుజ - కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. 

వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి

బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది .

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam