DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగష్టు 16 నుంచి ఏపీ లో పాఠశాలలు ప్రారంభం

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జులై 23, 2021 (డిఎన్ఎస్):* ఆగష్టు 16 నుంచి ఏపీ లో 2021 -22 విద్యా సంవత్సరం లో మొదటి సారి గా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు జారీచేశారు. మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్నారు. రెండోవిడత

నాడు –నేడుకు అదే రోజు శ్రీకారం చుడతారు. అదే రోజు విద్యాకానుక ప్రారంభం, నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమీక్షలో పలు అంశాలు చర్చించారు. 

►నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును సీఎంకు వివరించిన

అధికారులు
►నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు
►ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలన్న సీఎం

►కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్‌
►శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌  (

పీపీ–1, పీపీ–2)
►పౌండేషన్‌ స్కూల్స్‌  (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)
►పౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)
►ప్రీహైస్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
►హైస్కూల్స్‌  (3 నుంచి 10వ తరగతి వరకూ)
►హైస్కూల్‌ ప్లస్‌ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని తెలిపిన

సీఎం. 

►పౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా అంగన్‌ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది
►శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు రూపాంతరం చెందుతాయి
►శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌కు ఫౌండేషన్‌స్కూల్స్‌ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి
►ఇక్కడ కూడా ఎస్‌జీటీ టీచర్లు

పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు
►శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది. 
►కిలోమీటరు లోపలే పౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది
►మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది
►మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు
►వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా

విధానాన్ని అమలు చేయబోతున్నాం

►ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యం 
►పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది
►ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు 
►ఇంటర్‌

తర్వాత డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసి సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్నారు
►కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్ధితి ఉంది
►నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నాం
►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును

బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం 
►తద్వారా పిల్లలకు ఫోకస్డ్‌ ట్రైనింగ్‌ వస్తుంది 
►విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం
►ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ రాబోతున్నారు

►ఎందుకు ఈ విధానానికి పోతున్నామనే దానిపై

మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం
►పౌండేషన్‌ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా ? లేదా ? అని అధికారులను ప్రశ్నించిన సీఎం
►ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామన్న అధికారులు
►ఇందులో ఎటువంటి సందేహాలకు

తావుండరాదు
►తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి
►నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలియాలి
►ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి : సీఎం ఆదేశం

►నాడు – నేడు, నూతన విద్యావిధానంకోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం
►దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలను

స్పష్టంగా చెప్పాలి
►ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్ధ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలి
►మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి
►నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి

►అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి

ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పాటు చేస్తున్నాం
►ప్రతి తరగతికి ఒక టీచర్‌ ఉండేలా హేతుబద్దీకరణ
►జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్ధ 
►ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం

►మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలి 
►అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌

స్పష్టీకరణ
►పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం
►ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండరాదు
►ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు
►పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ గతంలో లేదు
►పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి
►అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదు
/> ►అధికారులకు స్పష్టం చేసిన సీఎం

►నూతన విద్యా విధానం, నాడు నేడు తొలిదశ పనులు పై సీఎంకు వివరాలందించిన అధికారులు
►తొలిదశలో నాడు–నేడు చేపట్టిన స్కూల్స్‌లో  పనులు దాదాపు పూర్తయ్యాయన్న అధికారులు
►అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో

మంచి ఫలితాలు అందించబోతున్నాయన్న అధికారులు
►స్కూల్స్‌ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించిన అధికారులు

►ఆగష్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం
►వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్‌

విద్యార్థులను పాస్‌చేశామన్న అధికారులు
►కొన్ని రిక్రూట్‌మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
►దీన్ని పరిగణలోకి తీసుకుని 2020 టెన్త్‌ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని నిర్ణయం
►అంతర్గత పరీక్షల ఆధారంగా

మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
►అలాగే 2021 టెన్త్‌ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
►స్లిప్‌టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇస్తామన్న అధికారులు
►మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని

వెల్లడించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam