DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కారు దొంగలను పట్టించిన ఫాస్టాగ్‌ స్కానింగ్ 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జులై 28, 2021 (డిఎన్ఎస్):* రాజమండ్రికి చెందిన సాయి భార్గవ్‌ , మున్నాలు చాలా చోరీలే చేశారు. వీరిపై 12 ఇళ్లల్లో దొంగతనాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఈ మధ్యనే జైలునుంచి విడుదలైన వీళ్ళు విశాఖలో కార్లపై కన్నేసి తస్కరించి.. ఫాస్టాగ్‌ పుణ్యామాని పోలీసులకు ఈజీగా

చిక్కిపోయారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నారు.

గాజువాక పంతులుగారి మేడ సమీపంలోఉంటున్న సాగర్‌ అనే వ్యక్తి.. మింది ప్రాంతంలో ఆటోకేర్‌ అనే కార్‌ షెడ్‌ నిర్వహిస్తున్నాడు. అతని షెడ్డుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్లు మరమ్మత్తుల కోసం వస్తుంటాయి. అయితే.. షెడ్డులో ఉంచిన

హ్యుండాయ్‌ వెర్నాటాటా టియాగియో కార్లు ఈనెల 25 రాత్రి చోరీకి గురయ్యాయి. తన షెడ్డు నుంచి కార్లు చోరీకి గురయ్యాయనే విషయం సాగర్‌కు తెలియలేదు

అతనికి కారు యజమాని నుంచి ఫోన్‌ కాల్‌. మరమ్మత్తులకు ఇచ్చిన కారు హైవేపై ఎందుకు తిరుగుతోందని ఓనర్‌ ప్రశ్న. అవాక్కైన సాగర్‌.. షెడ్డుకెళ్లి చూశాడు. దీంతో.. అక్కడ రెండు

కార్లు మిస్సయ్యాయి. హుటాహుటిన గాజువాక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళిన కారుషెడ్డు యజమాని.. ఫిర్యాదు చేశాడు.

కారుకున్న ఫాస్టాగ్‌ నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయి. కారు దొంగిలించి తీసుకెల్తున్న సమయంలో టోల్‌ప్లాజాల వద్ద కారుకున్న ఫాస్టాగ్‌ స్కాన్‌ అయింది. రాత్రి సమయంలో రెండు నుంచి మూడు మెసేజ్‌లు తన

మొబైల్‌కు రావడంతో అవాక్కైన యజమాని ఆ విషయం ఉదయాన్నే కారు షెడ్డు నిర్వాహకుడికి సమాచారం అందించాడు. ఆ క్లూ కేసును ఛేదించే విషయంలో కీలకంగా మారింది. 

పాతగాజువాకలోని పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కొట్టించుకున్నారు. ఆతరువాత మూడోకంటికి తెలియకుండా హ్యాపీగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ రాజమండ్రి వరకు

వెళ్ళిపోయారు. మధ్యలో అగనంపూడి టోల్‌ప్లాజా దాటే సరికి ఒకసారి, రాజమండ్రి వెళ్ళేలోగా మరో రెడు మూడు ఫాస్టాగ్‌ లు స్కాన్‌ అయ్యాయి. ఆ విషయం ఈ దొంగలు గుర్తించలేదు. దర్జాగా రాజమండ్రికి కార్లను తీసుకుని వెళ్ళిపోయారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam