DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29.7 ఎకరాల ఆక్రమిత భూమి దేవాదాయశాఖ స్వాధీనం 

*చంద్రమణి మహాదేవి ఇచ్చిన విరాళం వృధా కాకూడదు* 

*అంబికాబాగ్ రాముని అనుగ్రహమే ఇది: డీసీ జ్యోతి మాధవి* 

*మార్కెట్ విలువ రూ. 375 కోట్లు పైమాటే : ఏసీ శాంతి కళింగిరి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 03, 2021 (డిఎన్ఎస్):* దేవాదాయశాఖ చరిత్రలో దేవాలయ భూములు కాపాడేందుకు ఒక

మహిళా అధికారి ( డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణ అధికారి ఎస్ జ్యోతి మాధవి ), సుదీర్ఘ పోరాటం చేసి సంచలన విజయం సాధించారు. విశాఖపట్నం లోని మహారాణి పేట లో గల అంబికా బాగ్ రామాలయానికి చెందిన  29 ఎకరాల 71 సెంట్లు భూమి ( మార్కెట్ విలువ రూ.  375 కోట్లు పైమాటే)ఆక్రమణకు గురి కావడంతో స్వాధీనం చేసుకునేందుకు అవిశ్రాంత పోరాటం చేసారు.

వివరాల్లోకి వెళితే. . అంబికా బాగ్ దేవాలయం కు సుమారు 3 ఎకరాల  స్థలం ఇచ్చిన మహారాణి వైరిచర్ల చంద్రమణి మహాదేవి ఈ ఆలయ నిర్వహణకు 29 ఎకరాల 71 సెంట్ల భూమిని ఇనాంగా ఇస్తూ వీలునామా రాశారు. అది అన్యాక్రాంత కావడంతో 2014 నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, హైకోర్టు వరకూ వెళ్లి ఈ స్థలం ఆలయానికి చెందినదేనని ఆధారాలతో నిరూపించారు.

 మంగళవారం 
సహాయ కమిషనర్ శాంతి కాలింగిరి, స్థానిక పోలిసు అధికారుల సహకారంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

త్వరలోనే ఈ స్థలంలో ఆదాయ వనరులు వచ్చే విధంగా ప్రణాళిక వేయడం జరుగుతుందన్నారు. 

ఆ స్థలం ఇదే. . .: 

విశాఖ జిల్లా అనకాపల్లి లో రాణి గారి పూల తోట గా పిలవబడే ఫూల్ బాగ్ రోడ్లో

జిఎం వార్డులో టిఎస్ నేం 66 లో 29 ఎకరాల 71 సెంట్లు భూమి (వెంకటేశ్వర భాగ్) గా దేవాదాయ ధర్మాదాయ శాఖ లో రికార్డ్ అయి ఉండడంతో డిసి ఎస్ జ్యోతి మాధవి, ఏసీ శాంతి కాలింగిరి ఆధ్వర్యం లో స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీసుల సహాయంతో వెళ్లి బోర్డులు పాతి పెన్సింగ్ వేశారు. రికార్డుల ప్రకారం ఈ భూమి మాది అని దేవాదాయ ధర్మాదాయ శాఖ, కాదు

దశాబ్దాల కాలంగా ఆ స్థలం మాదే అంటూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుటుంబాలు మధ్య న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. అక్కడే ఉన్న పాడి రైతులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు మద్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

అధికారులు పోలీస్ సహకారంతో పాకలు తొలగించి పశువులను దూరంగా తోలి వేశారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ

కలెక్టర్ ఎస్. జె. మాధవి మీడియాతో మాట్లాడుతూ 29 ఎకరాల 71 సెంట్ల ఈ భూమి మహారాణి వైరిచర్ల చంద్రమణి మహాదేవి వీలునామా ప్రకారం విశాఖపట్నం మహారాణి పేట లోగల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయమునకు దూప దీప నైవేద్యం నిమిత్తం రాసి ఇచ్చారని తెలిపారు. అయితే కొంతమంది పలుకు బడి ఉన్న రాజకీయ బలంతో తప్పుడు పత్రాలు సృష్టించి

న్యాయస్థానంలో లిటిగేషన్ పెట్టి కౌలు రైతుల సహాయంతో ఈ భూమిని ఇంతవరకూ వారే హక్కుదారులుగా ఉన్నారని అన్నారు. 

దేవాదాయ ధర్మాదాయ శాఖ కు సంబంధించిన ఈ భూమి 2003 వ  సంవత్సరంలో హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తర్వాత రెవిన్యూ కోర్ట్ లు కూడా మా శాఖ కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయని కోర్ట్ ఆదేశానుసారం ఈ స్థలాన్ని స్వాధీనం

చేసుకున్నట్లు ఆమె తెలిపారు. 

ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి 375 కోట్లు ఖరీదు చేస్తుందని తెలిపారు దేవాలయం తరఫున సమర్థవంతంగా సీనియర్ న్యాయవాది ఎన్.వి.ఎస్. ప్రసాద్ వర్మ వాదించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుకూలంగా తీర్పు వచ్చినట్లు కృషి చేశారని అసిస్టెంట్ కమిషనర్ శాంతికాలింగిరి మీడియాకు తెలిపారు. 
/>  


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam