DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శని, ఆది, సెలవుల్లో సాయంత్రం బీచ్ రోడ్డు బంద్ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* ప్రతి శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు  రోజులలో  బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.  ఈనెల 4వతేదీన పర్యాటక  శాఖ మంత్రి ముత్తoశెట్టి శ్రీనివాసరావు 3వదశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ నిషేధం ఉత్తర్వులు  జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం  ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వ సెలవు దినాలు, శనివారం, ఆదివారం రోజులలో  సాయంత్రం 5.30 గంటల నుండి మరుసటిరోజు ఉదయం వరకు నిషేధాజ్ఞలు అమలులో

ఉంటాయని పేర్కొన్నారు. మూడవ దశ కొవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగామాస్క్ ధరించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam