DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొందూరు ఖ్యాతి మరింత పెంచాలి: కేంద్రమంత్రి నిర్మల

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, ఆగస్టు 07, 2021 (డిఎన్ఎస్):* పొందూరు ఖ్యాతి మరింత పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పొందూరులో చేనేత దినోత్సవ కార్యక్రమంలో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర  ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియను సీతారామన్ పరిశీలించారు. 50 నేత విధానాన్ని పరిశీలించారు. ఖాదీ వడికే విధానం, చరఖాలను ఏర్పాటు చేశారు.  ఖాదీ భవనం శిథలావస్థలో ఉండటం వలన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను

నాటి మొక్కల ప్రశస్తిని తెలిపారు. మహాత్మ గాంధి పొందూరు ఖాదీ నాణ్యత పట్ల ఎంతో ఆసక్తి చూపారని అన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఖాదికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఖాదీ బాగుపడాలనీ పిఎం చాలా పథకాలు ప్రకటించారను ఆమె అన్నారు. 
పిఎం జాతీయ చేనేత దినోత్సవంను జరుపుకునే ఏర్పాట్లు చేశారనీ అన్నారు. 2014

సంవత్సరంలో రూ.9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18 వేల కోట్లకు పెరిగిందని ఆమె వివారించారు. ఖాదీకి చాలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. అయితే కార్మికులకు గిట్టుబాటు ధరలు లేదని ఆమె పేర్కొంటూ మెగా హండ్లుమ్ క్లస్టర్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మంగళగిరిలో ఒక క్లస్టర్ వచ్చిందని, పొందూరులో సంఖ్య

తక్కువగా ఉండటంతో  క్లస్టర్ ఏర్పడలేదని గ్రహించామని చెప్పారు. పొందూరు లో క్లస్టర్ ఏర్పాటుకు టెక్స్ టైల్ మంత్రి తో మాట్లదాడుతామని మంత్రి తెలిపారు. ముద్ర లోన్ ల ద్వారా అనే రంగాలకు రుణాలు ఇవ్వవచ్చనీ, ప్రతి బ్యాంకు బ్రాంచ్ ద్వారా స్టాండ్ అప్ లోన్ ఇవ్వాలని ఆమె వివరించారు. 5 మంది  చేనేత కారులు పొందూరు లో ఉన్నారనీ

వారికి రుణాలు మంజూరు చేయడం ద్వారా ప్రోత్సహించాలని ఆదేశించారు. పొందూరు మరియు చుట్టు ప్రక్కల అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారని వారికి నాబార్డు బ్యాంకు, లీడ్ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.  మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. బ్యాంకుల ద్వారా ఎంత మంది కార్మికలకు రుణాలు ఇచ్చారో

బ్యాంకులు మరోసారి ఏర్పాటు చేసే ప్రదర్శనలలో పెట్టాలని కోరారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వ తేదీ నాటికి 50 శాతం రుణాలు పెంచాలనీ బ్యాంకులను ఆదేశించారు. జేమ్ - ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు అమ్మకాలకు మంచి ప్లాట్ ఫారం అని దానిలో పొందూరు ఖాదీ నీ చేర్చాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు. పొందూరు పేరెన్నిక గల

ప్రదేశం అని, అందరికి మనసులో పొందూరు ఉందని అన్నారు. పొందూరు గ్రామంలో గడపడం ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పలువురు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసారు. ప్రదర్శనలను పరిశీలించారు.
కార్యక్రమం లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్,

 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ శ్రీ కేష్, ఎంపీ లు జి.వి.ఎల్. నరసింహా రావు,  బెల్లం చంద్రశేఖర రావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్,

కే.శ్రీనివాసులు, హిమాంశ్ కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, ఆర్. శ్రీరాములు నాయుడు, వివిధ బ్యాంకుల సిఎండిలు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam