DNS Media | Latest News, Breaking News And Update In Telugu

(అ) రాజకీయ కీచక పర్వం లో విశాఖ రైల్వే జోన్ 

(అ) రాజకీయ కీచక పర్వం లో విశాఖ రైల్వే జోన్

విశాఖపట్నం, జులై 29 , 2018 (DNS Online ): లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్

ఏర్పాటు. ఉత్తరాంధ్రా వాసులని మాట భంగ పర్వం లో దారుణంగా మోసగించిన ఘనత అన్ని రాజకీయ పార్టీలదీని . దీనిపై అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న సర్కస్ ఫీట్లకు ప్రజలు

బలైపోతున్నా పట్టించుకునే నాధుడే లేడు. గత ఐదు పార్లమెంట్ ఎన్నికల్లో రైల్వే జోన్ నే మహా బూచి లాగా చూపించి ఎన్నికల్లో ఓట్లు దండుకుని, తీరా గెలిచాక కోట్లాది

నిధులతో వాళ్ళ సొంత వ్యాపారాలు నడుపుకున్న ఘనులే ఎక్కువ. దీనిలో ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేనే లేదు. రైల్వే పరంగా ఏడాదికి 7200 కోట్లాది రూపాయల ఆదాయం

అందిస్తున్నప్పటికీ విశాఖపట్నం డివిజన్ పట్ల తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులకు చిన్న చూపే ఉంది. విశాఖపట్నం నుంచి బయలు దేరే ప్రశాంతి ఎక్స్ ప్రెస్, విశాఖ

ఎక్స్ ప్రెస్ లాంటి అత్యధిక ప్రాధాన్యత కల్గిన రైళ్లను భువనేశ్వర్ కు తరలించుకు పోయినా నోరెత్తని ఎంపీ లు విశాఖపట్నం కు ప్రాతినిధ్యం వహించడం విశాఖ వాసుల

దురదృష్టం కావడం గమనార్హం అనే భావనలో ప్రజలు ఉన్నారు. రైల్వే లో ఉద్యోగాల పరీక్షల కోసం భువనేశ్వర్ కు వెళ్లే ఉత్తరాంధ్ర నిరుద్యోగుల సర్టిఫికెట్లు చించివేసి,

వారి పై భౌతిక దాడులు జరిగినా, కనీసం పట్టించుకోని ఎంపీ లను ఎన్నుకున్నందుకు విశాఖ నిరుద్యోగులు తమని తాము దూషించుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి రైలు

లోనూ అధిక శాతం బెర్తులను సైతం భువనేశ్వర్ కు తరలించుకు పోయి, ఆంధ్రా ప్రయాణీకులకు తీరని అన్యాయం చేస్తున్న నోరెత్తని నాయకులపై ఉత్తరాంధ్ర వాసులందరిలోనూ

వ్యతిరేకభావం నెలకొనివుంది. 
రాష్ట్ర విభజన సమయం లో సైతం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తాం అంటూ ప్రచారం చేసుకుని, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే

ప్రయత్నం చేశారు. à°…à°–à°°à°¿à°•à°¿  2014 లో రాష్ట్ర విభజన బిల్లు తయారీలో సైతం నాటి అధికార కాంగ్రెస్ పార్టీ, మరో ప్రక్క ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ విశాఖ రైల్వే జోన్ పై

విశృంఖల ప్రకటనలు చేసేసి, ప్రజల్లో మన్ననలు పొందే ద్దాం అనుకుని నానా హంగామా చేసేసారు. జాతీయ పార్టీలు గా ఉన్న ఈ రెండు పార్టీలు చట్ట సభల్లో ఇలా దొంగనాటకాలాడితే,

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రాష్ట్రాలకె పరిమితమైన పొట్టి జాతీయ పార్టీ తెలుగుదేశం కూడా తన స్థాయిలో నాటకాలాడేసింది. ఎన్నికల మానిఫెస్టో లో అగ్ర తాంబూలం రైల్వే

జోన్ కె ఇచ్చేసారు. తీరా గెలిచాక contd. . . . 

 

 

#dns #dns news #dnslive #dns live #visakhapatnam #vizag #railways #railway zone #parties #east coast #india #bjp #congress #telugudesam 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam