DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మైదానం ఇమ్మని అడిగితే విశాఖలో మద్యం దుకాణం ఇచ్చారు

*నివాసాల మధ్యే మద్యం దుకాణాలు ఏంటి? జనసేన*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 15, 2021 (డిఎన్ఎస్):* మహా విశాఖ నగరం 14 వ వార్డులోని స్థానికులు పిల్లల కోసం మైదానం ఏర్పాటు చెయ్యండి అని అడిగితే పెద్దల కోసం మద్యం దుకాణం ఏర్పాటు చేసారు. వివరాల్లోకి వెళితే. .

ఇటీవల జరిగిన గ్రేటర్

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికల్లో  ఈ నగరంలోని 14 వ వార్డు  కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి అనిల్ రాజుని ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలకు మైదానం ఏర్పాటు చెయ్యండి అని స్థానిక ప్రజలు విన్నవించారు.

రాజు గారు మహా దొడ్డ మనసు కల్గిన వారు.  . . పిల్లలకు మైదానం ఇస్తే. .

.ప్రభుత్వానికి ఏమొస్తుంది. అయినా ఓటు హక్కు లేని వాళ్లకి వరాలు ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నారో ఏంటో . . .

తనకి ఓటు వేసి గెలిపించిన మగమహారాజులకు ఒక మద్యం దుకాణం కేటాయించారు.  స్టార్ హోటల్ గా కనిపించే భవనం ఓ అపార్ట్మెంట్ సముదాయం లో అత్యాధునికమైన ఏర్పాట్లతో  ప్రభుత్వం అనుమతితో మద్యం దుకాణం తెరిచేసారు.

 

నగరంలోనే అత్యంత పోష్ లొకాలిటీ గా పిలువబడే బాలయ్యశాస్త్రి లే అవుట్ లోని డబల్ రోడ్ దగ్గర ఉన్న సారాయి దుకాణం చుట్టూ పరిసరాల్లో సుమారు 200 కి పైగా అపార్ట్మెంట్ లు, నివాస గృహాలు, విద్య సంస్థలు, తదితర ఉన్నాయి. 

వందలాది మంది ప్రజలు నివసించే నివాస గృహాలు, అపార్ట్మెంట్ ల మధ్యలో మద్యం దుకాణాలకు అనుమతి

ఎలా ఇస్తారు అని జివిఎంసి కౌన్సిల్ లో జనసేన పక్ష నేత, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ప్రధానంగా విశాఖలోని 14 వ వార్డు బాలయ్యశాస్త్రి లే అవుట్ పూర్తిగా అపార్ట్మెంట్ ల సముదాయమేనని, సుమారు 200 కి పైగా అపార్ట్మెంట్ లు, విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతంలో మహిళలు తిరిగేందుకు నానా ఇబ్బందులు

పడుతున్నారన్నారు. అదే సమయం లో ఈ దుకాణంలో సారాయి / మద్యం కొనుక్కోడానికి  వచ్చేవాళ్లు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పార్కింగ్ చెయ్యడం ఇతర పాదచారులు, వాహనదారులకు తలనొప్పిగా మారిందన్నారు. తక్షణం ఈ దుకాణాన్ని ఈ ప్రాంతంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam