DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైదిక విధానంగా వటువులకు ఋగ్వేద ఉపాకర్మ నిర్వహణ 

*21 న ఋగ్వేదం, 22 న యజుర్, అధర్వ బ్రహ్మచారులకు..*
  
*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 21, 2021 (డిఎన్ఎస్):* శ్రావణ మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఋగ్వేద సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ వటువులు ఉపాకర్మ వేడుకను వైదిక పరంగా నిర్వహించుకున్నారు. ఏడాది కాలంలో తెలిసో తెలియకో చేసిన దోషాలకు

పరిహారంగా చేసుకునే ప్రాయశ్చిత్తము ఈ ఉపాకర్మ. దీన్ని ఒక్కో వేదం సమ్పరాయడం వారు ఒక్కో రోజున నిర్వహించుకుంటారు. ఋగ్వేద సంప్రదాయ పరులు షావన మాసం లో వచ్చే శుక్ల పక్షంలో శ్రవణ నక్షత్రం రోజున ఈ వైదిక క్రియను ఆచరించడం ఆనవాయితీ. యజుర్వేదం, అధర్వ వేదం వారు శ్రావణ పౌర్ణమి రోజు,  సామవేదం సంప్రదాయం వారు హస్త నక్షత్రం రోజున ఈ

క్రియను చేసుకుంటారు. 

దీనిలో భాగంగా శనివారం ఉదయం బ్రహ్మచారులు నూతన యజ్ఞోపవీత ధారణ చేసి, కామోకార్షీ మంత్రం జపం పూర్తి చేసుకుని, అనంతరం శుద్ధి, దేవ తర్పణాలు, ఋషి తర్పణాలు, హోమ ప్రక్రియను నిర్వర్తించారు. ఉత్తరాయణం లో సాధారణంగా ఉపనయనం 7 సంవత్సరాల 3 నెలలు దాటినా వారికి బ్రాహ్మణ బాలురకు ఉపనయనం జరుపుతారు. అనంతరం

వారు త్రికాల సమయాల్లో సంధ్యావందనం ఆచరించాలి. తదుపరి వచ్చే దక్షిణాయనం లో శ్రావణ మాసంలో వీరికి ఉపాకర్మ చేసుకుంటారు., పూర్వం ఈ బాలురు అందరూ వేద గురుకుల పాఠశాలల్లోనే ఉండేవారు. నూతనంగా వేదవిద్య ను ఆరంభించుకునే ముందు ఈ ఉపాకర్మ జరుపుకుని, కొత్త పాఠం ఆరంభించుకోవడం ఆనవాయితీ. 
ప్రస్తుతం వేదం నేర్చుకునే వారి సంఖ్యా

తక్కువగా ఉండడం తో, ఈ ఉపకర్మ కూడా చాల చోట్ల కనుమరుగు అయ్యింది. 

అయితే సంప్రదాయాన్ని తప్పనిసరిగా పాటించాలి అనుకునే శ్రీవైష్ణవ వైదిక కుటుంబాల్లో ఈ ఉపాకర్మ నేటికీ కొనసాగుతోంది.  ఇదే సమయంలో బ్రహ్మచారులకు ఈ ఉపాకర్మ వైశిష్ట్యం, అది జరుపుకోవాల్సిన ఆవశ్యకత, ప్రాశస్త్యం, వివరించి, అది నిర్వహించుకునే

విధానాన్ని తెలియ చేస్తారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam