DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువులను తీవ్రవాదులతో పోల్చింది, క్రిమినల్ కేసు నమోదైంది

*(DNS report : Satya BVS, స్టాఫ్ రిపోర్టర్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 24, 2021 (డిఎన్ఎస్):* హిందువులను తీవ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ జూనియర్ నటి స్వర భాస్కర్ పై క్రిమినల్ కేసు పెడుతూ ఢిల్లీ కి చెందిన యువ న్యాయవాది యుక్తి రతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశారు. ఈ నెల 17 వ తేదీన సోషల్ మీడియా లో స్వర భాస్కర్ ఆఫ్ఘన్ లో ఎదో ఘోరం,

నేరం, అన్యాయం జరిగిపోతోంది అనే బాధపడే వాళ్లకి భారత్  లో ఉన్న హిందూ తీవ్రవాదం కనపడడం లేదు అనే సందేశాన్ని పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. గత కొంత కాలంగా ఈమె పూర్తిగా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, హిందూ సమాజాన్ని పూర్తిగా చులకన చేస్తూ పోస్టింగ్ లు పెట్టడం, సభల్లో పాల్గొన్న చర్చల్లో

ప్రచారం చెయ్యడం వంటి చేస్తుండడం తో ఇలాంటి వాళ్లు భారత్ దేశంలో ఉండకూడదు అని, వాళ్లకి నచ్చిన ఇస్లామిక్ దేశాలకు వెళ్ళవచ్చు అని, ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరిగితే దేశానికి చాలా ప్రమాదకరం, అని,న్యాయవాది క్రిమినల్ కేసు పెట్టారు. ఈ యువ న్యాయవాది కి అభినందనల వెల్లువ పెరుగుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam