DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగిందా కానట్టా?

*ఏపీ బ్రాహ్మణా కార్పొరేషన్ నుంచి అధికారిక ప్రకటనే లేదు*

*వాట్సాప్ యూనివర్సిటీ లో హంగామా తప్ప, వాళ్ళ వెబ్సైటులో లేదు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 27, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ గా సీతంరాజు సుధాకర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం

చేసినట్టా కాదా? అనేది సందిగ్ధం గానే ఉంది. ఈనెల 19 న ఒక ప్రయివేట్ స్టార్ హోటల్లో నాలుగు గోడల మధ్య అత్యంత పేదబ్రాహ్మణుల కార్పొరేషన్ కి చైర్మన్ గా హైటెక్ స్థాయి లో ప్రమాణం చేశారు అంటూ అయన అనుకూల బ్రాహ్మణా సంఘాలు వాట్సాప్ యూనివర్సిటీ లో నానా హంగామా చేశారు. వీళ్ళ వ్యతిరేక సంఘాలు ఇంత రహస్యంగా  చేస్తారా అంటూ వాళ్ళు కూడా

ఇదే యూనివర్సిటీ లో గగ్గోలు పెట్టారు. ఇదంతా సోషల్ మీడియా లో జరుగుతున్నా వ్యవహారం. దీనికి అధికారిక ప్రామాణికం ఉండదు. 

ఇంతవరకూ అధికారికంగా ప్రకటనే లేదు. .

అయితే ఈ విషయాన్నీ అధికారికంగా ధృవీకరించవలసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోని దేవాదాయ శాఖా, రెండో వాళ్ళు,

బ్రాహ్మణా కార్పొరేషన్ ప్రతినిధులు, ఇక మూడో వారు స్వయంగా చైర్మన్. ఇంతవరకూ ఈ ముగ్గురి నుంచి ఎటువంటి ప్రకటన ఇంతవరకూ అధికారికంగా వెలువడలేదు. వీళ్ళ నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే అది లబ్ధిదారులు అందరికీ కచ్చితమైన నమ్మకం కలుగుతుంది. 

కేవలం ఫోటో మాత్రమే. .ఉంది.

జులై 21 , 2021 న చైర్మన్ గా నియామకం

జరిగినట్టు గా ప్రభుత్వం వరకూ ఈయన నియామకం జరిగినట్టుగా మాత్రమే జీవో విడుదల చేసింది. 

ఇదే ఆదేశాలు pdf రూపంలో మాత్రమే బ్రాహ్మణా కార్పొరేషన్ అధికారిక వెబ్సైటు లో దర్శనమిస్తోంది. అయితే ఆయన చైర్మన్ గా భాద్యతలు చేపట్టినట్టుగా వెబ్సైటు లో ఎక్కడ పోస్ట్ ప్రచురించలేదు. కేవలం సుధాకర్ ఫోటో మాత్రమే పోస్ట్ చేసారు. ఇతర

వివరాలు ఏవీ లేవు. 

ఇక మూడో వారు స్వయంగా సీతంరాజు సుధాకర్. అయన కూడా ఇంతవరకూ తానూ చైర్మన్ గా భాద్యతలు చేపట్టినట్టు గా మీడియా ద్వారా గానీ, మరో విధంగా గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. పైగా నాటి ఫోటోలను కూడా విడుదల చెయ్యలేదు. 

ఈ ముగ్గురే అయన పదవి ప్రమాణ స్వీకారాన్ని అధికారికంగా ప్రకటించవలసింది. వారు ఈ

రోజు వరకూ ఎక్కడా ప్రకటించలేదు. 

పైగా మీడియా ప్రతినిధులను కూడా ఆ నాటి హైటెక్ ప్రమాణ స్వీకార సభకు ఆహ్వానించలేదు. ఆ మీడియా ద్వారా కూడా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది.

ఇంతకీ బ్రాహ్మణా కార్పొరేషన్ కు గానీ, ప్రభుత్వ  దేవాదాయ శాఖా కు గానీ సంబంధించిన అధికారులు కూడా ఆ సభలో

పాల్గొన్నట్టుగా ఎక్కడా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 

అయితే బ్రాహ్మణా సంఘాల హంగామా, అత్యుత్సాహం ఆయనకు ఇబ్బంది, మరింత తలనొప్పి కల్గించేవి గా తయారయ్యాయి. 

ఇప్పడికే దాదాపు మూతబడిన ( దివాళా తీసిన అనవచ్చొ లేదో తెలియదు కానీ) సంస్థ లోని పథకాలన్నింటికీ ఇప్పడికే నూకలు చెల్లిపోయాయి. ప్రస్తుతం ఈ

కార్పొరేషన్ లో ఏ ఒక్క స్కీం కూడా నడవడం లేదు అంటూ రాష్ట్రంలోని బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు.  

గత ప్రభుత్వ హయాంలో 2016 లో కార్పొరేషన్ మొదలైనప్పుడు ఉన్న పధకాలు గాయత్రీ విద్య, భారతి విద్యా, వసిష్ఠ పోటీ పరీక్షలు, ద్రోణాచార్య నైపుణ్య వృద్ధి,  చాణక్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పధకం, కశ్యప

వృధాప్య పింఛను, గరుడ అంత్యక్రియల సాయం, భార్గవ భాగస్వామ్యం, శ్రీ కృష్ణ సుధామ పధకం, యాక్షన్ బ్రాహ్మణా నిధి పధకం ఇకపై గడిచిన విషయంగానే చెప్పుకునే స్థితి వచ్చేసింది అని బ్రాహ్మణా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. 

ఇలాంటి అత్యున్నత ప్రమాణాలతో ఈ కార్పొరేషన్ అద్భుతమైన లాభాలబాటలో నడుస్తున్నందున అధికార పార్టీ కి

చెందిన బ్రాహ్మణా ప్రతినిధులకు చెందిన బ్రాహ్మణా సంఘం మాత్రం ఈ పథకాలన్నీ ఖఛ్చితంగా తిరిగి అమలు పరుస్తాము అంటూ మీడియా సమావేశాల్లో బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. 

అదే నిజమైతే ఈ పార్టీ మరో 30 ఏళ్ళు అధికారంలో నిలబడినా ఆశ్చర్యపోనక్కరలేదు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam