DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయాల విముక్తి కై ఈనెల 13 నుంచి పాదయాత్ర

*Temples be freed from Govt, Padayatra to Tirumala*

*మన దేవాలయాలు మనకే - ప్రభుత్వం పెత్తనం కూడదు* 

కర్మన్ ఘాట్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*భాగ్యనగరం / విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ పెత్తనాల్లో ఉంది పూర్తిగా దోచుకోబడుతున్న హిందూ దేవాలయాలకు ఈ కబంద హస్తాల

నుంచి పూర్తిగా విముక్తి లభించాలి అనే డిమాండ్లతో మన దేవాలయాలు మనకే ఉద్యమం విస్తృతంగా సాగుతోంది. దీనిలో భాగంగా భాగ్యనగరం లోని కర్మన్ ఘాట్ నుంచి తిరుమల వరకూ మహా పాదయాత్ర వరకు మహా ఉద్యమం నిర్వహించేందుకు హిందూ సమాజం, హిందుత్వ రక్షణ సంఘాలు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 3 వరకు సాగే ఈ యాత్రలో ప్రతి హిందువు

బంధువు సంఘీభావము ప్రకటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కోట్లాది మంది హిందువులు తమ సంప్రదాయాన్ని రక్షించుకునేందుకు దేవాలయాలకు కోట్లాదిగా నిధులు హుండుల్లో మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఇలాంటి దేవాలయాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని, కోట్లాది నిధులను అన్యమత sansthalaku తరలించడాన్ని హిందూ  భక్తులు, హిందూ సంఘాలు

వీరవంగా వ్యతిరేకిస్తున్నాయి. 

 పైగా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా హిందూ దేవాలయాలకు కేటాయింపులు చెయ్యడం లేదు. గుళ్ళల్లో వచ్చిన ఆదాయాన్ని కోట్లాదిగా దోచుకుంటున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 

ఈ దేశంలో కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ప్రభుత్వాలు తమ అధీనం లోకి తీసుకున్నాయి.  ఇతర

మాటలైనా క్రైస్తవ, ముస్లిం, సిక్కు లాంటి ప్రార్ధన సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకోక పోగా వాటికి ప్రత్యేక నిధులను హిందూ దేవాలయాల నుంచి కేటాయింపులు చేస్తున్నాయి అని హిందూ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఇలాంటి కిరాతక పాలనా నుంచి హిందూ దేవాలయాలను విముక్తి కల్గించాలని సంకల్పంతో మహా పాదయాత్ర చేస్తున్నట్టు

నిర్వాహకులు తెలియచేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే, ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని తెలియచేస్తున్నారు. ఈ పాదయాత్ర వివరాలను ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని హిందూ భక్తులు ఈ యాత్రలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. 

సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 3 వరకు మహా ఉద్యమం:   

షెడ్యూల్

సెప్టెంబర్ 13, 2021 : ఉదయం 7 గంటలకు హైదరాబాదు లోని కర్మన్ ఘాట్ ఆంజనేయ దేవాలయం నుండి ప్రారంభం, ఔటర్ సమీపంలో భోజనం, యల్లగిరిలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 14 న  : ఉదయం యల్లగిరిలో ప్రారంభం, గుడ్రాంపల్లిలో భోజనం, రాత్రి కి  భోజనం చిట్యాల, బస 

సెప్టెంబర్ 15 న: ఉదయం చిట్యాలలో ప్రారంభం, నార్కట్

పల్లిలో అల్పాహారం, కామినేని ఆస్పత్రి వద్ద భోజనం, నకెరేకల్ లో రాత్రి భోజనం, బస

సెప్టెంబర్ 16న : ఉదయం నకిరేకల్ ప్రారంభం, సుబ్బయ్య హోటల్ వద్ద అల్పాహారం 
రాయన్ గూడెం వద్ద భోజనం, ఉండ్రుగొండ లో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 17న : ఉదయం ఉండ్రుగొండ లో ప్రారంభం, మునగాలలో భోజనం, కోదాడలో రాత్రి భోజనం,

బస 

సెప్టెంబర్ 18న : కోదాడలో ప్రారంభం, చిల్లకల్లులో భోజనం, కొనకంచిలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 19న : కొనకంచిలో ప్రారంభం, నందిగామలో అల్పాహారం, కంచికచర్లలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 20న:  కంచికచర్లలో ప్రారంభం, గొల్లపూడిలో భోజనం, విజయవాడలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 21న:

 విజయవాడలో ప్రారంభం, మంగళగిరిలో అల్పాహారం, చినకాకానిలో భోజనం, గుంటూరులో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 22న : గుంటూరులో ప్రారంభం, చేబ్రోలులో అల్పాహారం, పొన్నూరులో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 23న : పొన్నూరులో ప్రారంభం, బాపట్లలో భోజనం, చీరాలలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 24న : చీరాలలో

ప్రారంభం, చిన్న గంజాంలో భోజనం, ఉప్పు గూడూరులో రాత్రి భోజనం, బస

సెప్టెంబర్ 25న : ఉప్పు గూడూరులో ప్రారంభం, చేగూరుపాడులో భోజనం, ఒంగోలులో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 26న : ఒంగోలులో ప్రారంభం, టంగుటూరులో భోజనం, సింగరాయకొండలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 27న : సింగరాయకొండ లో ప్రారంభం, కావలిలో

రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 28న : కావలిలో ప్రారంభం, బిట్రగుంటలో భోజనం, తలమంచిలో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 29న : తలమంచిలో ప్రారంభం, నెల్లూరులో భోజనం, కక్కుతూరులో రాత్రి భోజనం, బస 

సెప్టెంబర్ 30న : కక్కుతూరులో ప్రారంభం, మనుబోలులో భోజనం, ముత్యాలపాడులో రాత్రి భోజనం, బస 

అక్టోబర్

1న : ముత్యాలపాడులో ప్రారంభం, నాయుడుపేటలో భోజనం, చావలిలో రాత్రి భోజనం, బస 

అక్టోబర్ 2న : చావలి లో ప్రారంభం, శ్రీకాళ హస్తిలో భోజనం, ఏర్పేడులో రాత్రి భోజనం, బస 

అక్టోబర్ 3 న : ఏర్పేడులో ప్రారంభం, సీతంపేటలో భోజనం, తిరుపతిలో రాత్రి భోజనం, బస
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam