DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ పండగలకే కోవిడ్ రూల్స్ వర్తిస్తాయా?: పవన్ కల్యాణ్

*వైసీపీ నేతల వర్థంతి, పండగలు పబ్బాలకు వర్తించవు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 07, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం *హిందూ పండగలకే కోవిడ్ రూల్స్ వర్తిస్తాయా?,  వైసీపీ నేతల వర్థంతి, పండగలు పబ్బాలకు వర్తించవా అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం ఆన్

లైన్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో అయన పలు అంశాలను వివరించారు. ప్రస్తుతం ఏపీ లో కోవిద్ నిబంధలన్నీ కేవలం హిందువుల పండగలకు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. వినాయక విగ్రహాలు చేసే కళాకారుల్ని అరెస్టు చేసి విగ్రహాలు పట్టుకుపోతున్నారు... ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. 
రథాలు దగ్ధం చేసి...

శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే దోషులను ఈ రోజు వరకూ పట్టుకోలేదనున్నారు.

వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో నాకు నిజంగా అర్ధం కాలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిసంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం

నమ్మశక్యంగా లేదు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా? ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు

అనేది మన రాష్ట్రంలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోంది. 
పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఇక్కడ మాత్రం పండగను చేసుకోవద్దని చెప్పడం, గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలి. మన భారతదేశంలో ఏ

పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికే. విఘ్నాధిపతికి నమస్కారం చేసుకొనే  ఏ పనైనా మొదలుపెడతాం. అలాంటి గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా, రథాలను కాల్చేసినా, శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఈ రోజు వరకు దోషులను పట్టుకోలేదు. వారిని

పట్టుకోకపోగా, ఈ రోజు కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయి. 
•    ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి 
ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు? దేనిమీద దాడి చేస్తున్నాయో అర్ధమవుతుందా? ఒక్కసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి ఒకటే

చెబుతున్నాం. మీరు వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పక్క రాష్ట్రాలు ఎలాంటి పరిమితులతో అనుమతులు ఇచ్చాయో మీరు కూడా అదే పరిమితులతో ఇక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వాలి. ఇది విశ్వాసానికి సంబంధించినది కాబట్టి అలా ఇస్తేనే మంచిది. జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది ఇంతకుమించి గొడవ చేయకుండా పర్మిషన్లు

ఇవ్వాలి. ఇచ్చి తీరాలి. వేరే దారి లేదు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam