DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా వీఎండీఏ కళాభారతి వార్షికోత్సవం ప్రారంభం 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* 

విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి వారు నిర్వహిస్తున్న వార్షిక వారోత్సవాలలో సంగీత నృత్య నాటక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. 
ఈరోజు 11. 9. 21 ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా స్థానిక విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్

శ్రీ కే రామమోహనరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం చేశారు. 

సభ ప్రారంభానికి ముందు వందేమాతరం అంటూ జాతీయ గీతాన్ని ద్వారం త్యాగరాజు శిష్య బృందం గానం చేసి ప్రార్ధనా గీతంగా పాడేరు. 

తర్వాత కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ కళాభారతి గత 35 సంవత్సరాలుగా సంగీత సాహిత్య నాటక

నృత్య ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ కళలను కళాకారులను ప్రోత్సహిస్తోందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న జాతీయ పురస్కార సభ గత రెండేళ్లుగా కరోనా వల్ల జరుపుకో లేక పోయామని కానీ ఈ సంవత్సరం కనీసం సంగీత సభలు అయినా జరపాలని ఏడురోజుల  సంగీత నృత్య నాటక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

వ్యవస్థాపక

అధ్యక్షులు శ్రీ సి ఎస్ రాజు  మాట్లాడుతూ  కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు ఇతర ట్రస్టీలు మనసుపెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రత్యేకంగా కార్యదర్శి  రాంబాబే కళాభారతి- కళాభారతే రాంబాబు అన్నట్టు కృషి చేస్తున్నారని వ్యక్తపరిచారు. 
ముఖ్య అతిథి మాట్లాడుతూ అతిరధమహారధులను ఇక్కడికి రప్పించి

కార్యక్రమాలు నిర్వహింస్తూ విశాఖ వాసులకు చూస్తూ వినే భాగ్యాన్ని కలిగిస్తున్న VMDA కళా భారతి వారిని అభినందించారు.

తదుపరి ఈ ఉత్సవాలకు ఆర్థికంగా సాయపడిన శ్రీ C.. S. N.  రాజు,  S. R. K.  ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, బD. S. N.  రాజు లక్ష్మీకాంతం చారిటబుల్ ట్రస్ట్ వారికి, ఈస్ట్ కోస్ట్ పెట్రోలియం ప్రైవేట్

లిమిటెడ్ వారికి, వైభవ్ జ్యువెలర్స్, పైడా కృష్ణ ప్రసాద్, మహా మారుతి లాజిస్టిక్స్, కంకటాల సిల్క్, సాముద్రిక సాఫ్ట్వేర్  వీరందరికీ జ్ఞాపికతో సత్కరించారు. 

కళాభారతి లో ఉన్నటువంటి అనేక వాగ్గేయకారుల చిత్ర పటాలను నవీకరించు సుందరీకరణ చేసినటువంటి సుసర్ల ఫ్యామిలీ అభినందిస్తూ  శ్రీ రామ గోపాల్ కి శాలువా

 జ్ఞాపిక లతో  పుష్ప గుఛ్ఛం తో సత్కరించి అభినందించారు. 

గుమ్ములూరి రాంబాబు ధన్యవాదాలు తెలియజేస్తూ చెబుతూ ముఖ్యంగా స్పాన్సర్లు ముఖ్యంగా కళా భారతి లో జరిగే కార్యక్రమాలను కోట్లాది మందికి తెలియజేస్తూ 
కళలని ప్రోత్సహిస్తున్న పత్రికా విలేకరులు ప్రత్యేకంగా ప్రశంసిస్తూ వచ్చిన వారికి జ్ఞాపికలతో

సత్కరించారు. 
తర్వాత జరిగిన నిత్య కార్యక్రమంలో స్థానిక కూచిపూడి కళాక్షేత్రం ప్రఖ్యాత నృత్య గురువవు శ్రీ హరి రామ్ మూర్తి గారి శిష్య బృందం అద్భుతంగా ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. 
ప్రారంభం అంశంగా వినాయక స్తుతి ముత్తుస్వామి దీక్షితార్ వారి రచన అరభి రాగం లో ఆదితాళంలో వారు చేసే నృత్య కార్యక్రమం

నిర్విఘ్నంగా జరగాలని పూజిస్తూ ప్రదర్శిచారు. 
రెండవ అంశంగా రాగమాలిక ఆదితాళం పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు రూప కల్పన చేసిన "అప్సరసలు" మేనకా విశ్వామిత్రుల కలయిక ప్రత్యేకంగా తీసుకొని అత్యంత అద్భుతంగా నృత్యం చేసారు కళాకారులు. 

మూడవ అంశంగా శివ  సాంభవి తాండవ నృత్యాన్ని ఆనంద హెలి ని ప్రదర్శించిన

తీరు సాక్షాత్తు శివ పార్వతి వేదికమీదకు వచ్చారా అన్నట్టుగా ప్రదర్శించారు. 

తరువాత రామదాసు కీర్తన. ఈ అంశంలో దశావతారాలు శ్రీ మహావిష్ణువు  పది అవతారాలను కళ్ళకు కట్టినట్టుగా నృత్యం చేసి పది అవతారాలను సాక్షాత్కరింపజేశారు. 
చిమరి అంశంగా తిల్లానా కేదార గౌళ రాగం లో ఆదితాళంలో శ్రీ గురు హరి రామ్మూర్తి

గారు కొరియోగ్రఫీ చేసిన అంశాన్ని న్రుత్త, నృత్య లయ  బధ్ధంగా ప్రదర్శించి శ్రోతలందరి మంత్రముగ్ధులను చేసి కరతాళధ్వనులతో అభినందనలు పొందారు. 
ఇందులో క్రిష్ణ సింధు, విజయ బిందు, మంజూష, వినీత, రమ్య, లక్ష్మి ప్రియ, భూమిక, లావణ్య, చాందిని, చరిష్మా, యామిని, అమృత & లిఖిత నృత్యం చేశారు. 

చివరగా కార్యదర్శి రాంబాబు

మాట్లాడుతూ ఆదివారం నాడు ప్రముఖ గాత్ర   విద్వాంసురాలు మండా సుధారాణి గారి కచేరి ఉంటుందని ఆరున్నర గంటల కంటే ముందుగానే విచ్చేసి ఆసీనులు కావాలని కోరారు.

ప్రతి ఒక్కరూ CARONA నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam