DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏజెన్సీ లో క‌ళ‌క‌ళ‌లాడుతున్న స‌ర్కారు బ‌డులు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయనగరం, సెప్టెంబర్ 14, 2021 (డిఎన్ఎస్):* విజయనగరం జిల్లా లోని కురుపాం విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని, విద్యే యువతను ఉన్నత స్థానాల్లో నిలబెడుతుందని భావించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యను అందించాలనే ప్రధాన లక్ష్యం తో ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

విద్యాభివృది కోసం విప్లవాత్మక మార్పులు చేశారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎప్పటికీ తరగని ఎవ్వరూ దొచుకోలేని ఆస్తిగా విద్యను ప్రతి పేద కుటుంబానికి అందజేసే దిశగా పలు మార్పులు చేసి ప్రతి పేద  విద్యర్ధికి మెరుగైన విద్యను అందజేస్తున్నారు. 

అమ్మఒడి పథకం వలన పిల్లల తల్లిదండ్రులు పై ఆర్ధిక భారం తగ్గిందని,

అన్ని సదుపాయాలు కల్పించి వెనుక బడిన ప్రాంతంలో గిరిజన విద్యార్థిని, విద్యార్థులు జీవితాలలో వెలుగులు వచ్చిందని కురుపాం మండల విద్యాశాాఖాధికారి ఎన్.సత్యనారాయణ తెలియచేస్తున్నారు. 

      దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాభివృదికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు విద్యార్థిని, విద్యార్థుల

జీవితాల్లో వెలుగులు నింపు తున్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు, మంచి విద్య మెరుగైన ఫలితాలు సాధించేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టారు.
విప్లవాత్మక కార్యక్రమమైన నాడు నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు, అమ్మావడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ, జగనన్న విద్యా

కనుక ద్వారా నాణ్యమైన పుస్తకాలు, బూట్లు, యూనిఫాం అందిస్తున్నారు.  అంతే కాకుండా 3 కిలో మీటర్లు కంటే దూరంగా నుండి నడిచి వచ్చే విద్యార్థులకు రవాణా ఛార్జీలు అందిస్తూ వారికి చదువుకోవాలి అన్న సంకల్పాన్ని కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలు

దేశానికే ఆదర్శం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

     ఈ పథకాలు విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతమైన కురుపాం మండలంలో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి జీవితాల్లో మార్పులు తీసుకు వస్తున్నాయి.

     ప్రభుత్వ పథకాలు అందిస్తూ పలు సమస్యలను అధిగమిస్తూ గిరిజన విద్యార్థిని, విద్యార్థుల

జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రతి విద్యార్ధి పనులకు పోకుండా విద్యపై ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. 
ఈ వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వ బడుల్లో గణనీయంగా ఎన్రోల్మెంట్ పెంచాయి. డ్రాపౌట్స్ నివారించాయి. విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది.
      కురుపాం మండలంలో నాడు నేడు పనుల నిమిత్తం రూ.814.76 లక్షలు ఖర్చు

చేయడం జరిగింది. రూ. 563.16 లక్షలు పాఠశాలల భవనాలు, మరుగు దొడ్లు, కరెంట్ మరమ్మతుల చేపట్టి మిగిలిన నిధులతో 635 బెంచీలు, 631ఫ్యాన్లు, 178 బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలంలో ఉన్న 177 పాఠశాలల్లో 7,882 మంది విద్యను అభ్యసిస్తున్నరు. మండలంలో 581 మంది 10వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. మండలంలో 7,312 మంది అమ్మ వడి పథకం పొందుతున్నారు.

మండలంలో మొత్తం 7,882 మంది విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యకనుక కిట్లు అందజేశారు. అంతే కాకుండా మండలంలో 3కిలో మీటర్లు దూరం నుండి వచ్చిన 73 మంది విద్యార్థిని, విద్యార్థులకు అదనంగా రూ.6,000 అందిస్తున్నారు. గత సంవత్సరం రూ. 4,38,000 రవాణా ఖర్చులు అందజేశారు.

           మండలంలో ప్రతి పాఠశాలలో ప్రభుత్వం

నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందిస్తున్నారు. ముఖ్యంగా వారానికి 5 గ్రుడ్లు విద్యార్థులకు వరమనే చెప్పాలి. మన ఇంటి భోజనం కన్నా మెరుగైన భోజనము పాఠశాలలో అందించడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా విద్యానభ్యసించగలుగుతున్నారు. ఈ పధకాలు అమలుతో గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత  విద్యను

పొందుతున్నారు, పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు వలన అన్ని వర్గాలు వారు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్చుతున్నారు.
నాడు నేడు కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాల తో సమానంగా మౌలిక సదుపాయాలు పొందాయి. 
     పాఠశాల పరిసర గ్రామాలలో బాల్యవివాహాలు వలన కలిగే అనార్ధాలుపై అవగాహన కార్యక్రమాలు

నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పధకాలు వలన విద్యార్థినీ, విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, డ్రాపౌట్స్ తగ్గాయని, ఈ ప్రాంత గిరిజన విద్యార్థుల జీవితాలు మెరుగుపడుతున్నాయి.
 
     పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని, జగనన్న విద్యాకానుక ఎంతో ఉపయోగకరంగా ఉందని, టీచర్స్ ప్రోత్సాహంతో బాగా చదువు

కుంటామని విద్యార్థిని, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam