DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ కు ధృడ చిత్తం ఉన్న ఎంతో మోదీ అవసరం: పవన్ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* మన భారత దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మోడీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ. . పవన్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఆ నాయకుడు మన విశాల  భారత

సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి. ముఖ్యంగా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన  ఒక బిలియన్ ప్రజల భూమిని  పాలించడం అంటే.. కత్తి మీద సాము వంటిదే. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి స్థానంలో నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ

గారు.. గొప్ప దార్శనికునిగా భావిస్తానన్నారు. 
2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా మోదీ తో  కలసి అనేక సభలలో  ప్రచారంలో చేసే  గొప్ప అవకాశం నాకు లభించిందని, ఆయనలోని ఆకర్షణ శక్తిని  సునిశితంగా గమనించడానికి  ఆ ప్రయాణం నాకు దోహదపడిందన్నారు. ఆయనను రాజకీయంగా వ్యతిరేకించే ప్రత్యర్ధులు సైతం దేశం పట్ల ఆయనకు ఉన్న

నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేరు. 71వ జన్మదినం జరుపుకొంటున్న నరేంద్ర మోదీ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam