DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 7 నుంచి కాళీ వనాశ్రమంలో శరన్నవరాత్రి వేడుకలు

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 18, 2021 (డిఎన్ఎస్):* నంబూరు లోని సర్వాధిష్టాన చైతన్య సమర్ధ సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద్ బాబూజీ శ్రీ కాళీ వనా శ్రమం లో  శ్రీ దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవ వేడుకలు అక్టోబర్ 7 నుంచి 16 వరకు జరుగుతున్నట్టు ఆశ్రమ ప్రతినిధి పెంటపాటి రాజా

తెలియచేసారు. ఆశ్రమ  నిర్వాహకులు అందించిన వివరాల ప్రకారం  లోక కళ్యాణార్ధము శ్రీ దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవములు స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుధ్ధ ఏకాదశి వరకు (07.10.2021 గురువారం నుండి 16.10.2021 శనివారం వరకు) నిర్వహించబడును. 

నిత్య కార్యక్రమములు - ఉదయం 4 గం.లకు

మేలుకొలువు, సుప్రభాతం, నగర సంకీర్తన. 5 గం.లకు ప్రార్ధన. 6 గం.లకు ఆలయ దర్శనములు, తీర్థ ప్రసాదములు. సా. 6 గం.లకు ప్రార్ధన, 7 గం.లకు సాయంకాల పూజ, దర్శనము ఉంటుంది.  

నవరాత్రి వేడుకల్లో. . .

1. 07.10.2021 గురువారం ఉ. 8.28 గం.లకు పూజ్య శ్రీ మాతాజీ వారిచే శ్రీ శరన్నవరాత్రి పూజ దీక్షా స్వీకరణము, అఖండ జ్యోతి

ప్రజ్వలనము, 

2. 07.10.2021 నుండి 16.10.2021 వరకు ప్రతిరోజు ఉదయం 8 గం. నుండి 9గం. వరకు శ్రీనివాస రామానుజదాసు చే శ్రీ దేవీ భాగవత ప్రవచనము.

3. 08.10.2021 శుక్రవారము నుండి 15.10.2021 శుక్రవారము వరకు: ఉదయం 9గం.ల నుండి సత్సంగ సమావేశము, ఆధ్యాత్మిక ప్రసంగములు, పూజ్య మాతాజీ వారి అనుగ్రహభాషణము, పూజ్య బాబూజీ దివ్య దర్శనము, బోధ

(వీడియో).

4. 07.10.2021 గురువారము నుండి 16.10.2021 శనివారము వరకు: మధ్యాహ్నం 2 గం.ల నుండి శ్రీ జగన్మాత ఆలయంలోను, శ్రీ బాబూజీ మహరాజ్ వారి దేవతార్చన మందిరంలోను శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనలు, మహామంగళహారతి, మహామంత్రపుష్పము, శ్రీ జగన్మాత దర్బారు (చతుర్వేద. ఉపనిషత్, గీతా, రామాయణ, భారత, భాగవత, తర్య, వ్యాకరణ, వేదాంత శాస్త్ర,

స్తోత్ర, గానములతో), జగన్మాత దర్శనము, తీర్థ ప్రసాదములు, భక్త సమారాధన. 

5 . 12.10.2021 మంగళవారము మూలా నక్షత్రం. సరస్వతీ పూజ. శ్రీ జగన్మాత సామూహిక కుంకుమ పూజలు 

6 . 13.10.2021 బుధవారము దుర్గాష్టమి. 

7. 14.10.2021 గురువారము మహర్షవమి.

8. 16.10.2021 శుక్రవారము విజయదశమి. శ్రీ జగన్మాత సామూహిక కుంకుమ పూజలు,

అన్నప్రాశనలు, అక్షరాభ్యాసములు (రామాలయములో జరుగును). 

9. 16.10.2021 శనివారము ఏకాదశి, ఏకాహం, దీక్షావిరమణ, బీజాక్షరపూతమైన మంత్రాక్షతలతో మాతాజీ ఆశీస్సులు. సాయంత్రం 5 గం.లకు శ్రీ జగన్మాత నగరోత్సవం, రాత్రి 7గం.లకు సద్గురు పొదపూజా మహోత్సవము.

ముఖ్య గమనికలు:

1. సమయానుకూలముగా కార్యక్రమములలో మార్పులు,

చేర్పులు ఉండవచ్చును. దయచేసి సహకరించ ప్రార్ధన.

2. 08.10.2021 శుక్రవారము నుండి 15.10.2021 శుక్రవారము వరకు ప్రతిరోజూ మధ్యాహ్న పూజానంతరం పూజ్యశ్రీ మాతాజీ వారు భక్తులకు తీర్థంయిస్తారు.

3. 12.10.2021 మంగళవారం సరస్వతి పూజ మరియు 15.10.2021 శుక్రవారము విజయదశమి సందర్భముగా, భక్తుల అభీష్టానుసారముగా శ్రీ జగన్మాత సామూహిక కుంకుమ పూజలు

ఏర్పాటు చేయబడినవి. ఆసక్తిగలవారెవరైనా పూజ చేసికొనవచ్చును. పూజ సామగ్రి నిర్వాహకులే అందజేస్తారు, పూజలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగానే ట్రస్ట్ ఆఫీసులో తమ పేరు, గోత్రము నమోదు చేయించుకొనవలెను. వివరములకు ట్రస్ట్ ఆఫీసులో సంప్రదించవలెను. 0863-2203564, మొబైల్ 9493786601-03. ల్లో సంప్రదించవచ్చు. 

15.10.2021 శుక్రవారము విజయదశమి

రోజున పూజ్యశ్రీ మాతాజీ వారిచే అన్నప్రాశనలు, నామ కరణములు, అక్షరాభ్యాసములు జరిపించుకోదలచినవారు తమ సామగ్రితో ఉ. 9 గంటలకు సిధ్ధముగా ఉండవలెను.

5. 08.10.2021 శుక్రవారము నుండి 15.10.2021 శుక్రవారము వరకు ప్రతి దినము మధ్యాహ్నము 2 గం.ల నుండి శ్రీ బాబూజీ వస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) దర్శించవచ్చును. శ్రీ బాబూ విజ్ఞాన మందిర్ మొదటి

అంతస్థులో).

6. 07.10.2021 నుండి 15.10.2021 వరకు ప్రతి రోజూ శుచిగా, రోజుకు పన్నెండుసార్లు దీక్షతో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ (లక్షనాను పారాయణ) చేసి జగన్మాత అనుగ్రహం పొందండి.

16.10.2021 శనివారము సద్గురు పాదపూజ అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదములతో బాటు, ఈ నవరాత్రులలో జగన్మాతకు పూజచేసిన పూజా కుంకుమ,

బీజాక్షరపూతములైన మంత్రాక్షతలు ప్యాకెట్లలో ఇవ్వబడును. ఈ కుంకుమను, అక్షతలను ప్రతిరోజూ జగన్మాత స్మరణతో ధరించినా, దగ్గర ఉంచుకున్నా అనంతశక్తిస్వరూపిణి, అవ్యాజ కరుణామూర్తి అయిన జగన్మాత మనకు అనుక్షణము తోడునీడగా నిలిచి ఉంటుందని విశ్వసించండి. అవి రోగ, చోర, శతృ, భూత, ప్రేత, పిశాచాది పీడల నుండి, అన్ని ఉపద్రవములనుండి

కాపాడగలవు. ఆధ్యాత్మిక సాధనలోను, వ్యాపార, వ్యవసాయ, విద్యా, వృత్తి, ఉద్యోగాదులలోను అభివృద్ధి కలిగిస్తాయి. సమస్త సత్సంకల్పాలను నెరవేర్చగలవు. అలా ఎందరెందరో అనుభవాలను పొందుతున్నారు. 8. ఆశ్రమమునకు యిచ్చు విరాళములన్నిటికీ ఆదాయపు పన్ను చట్టము సి. అంG ప్రకారము రాయితీ లభించును. 

సద్గురు మండల దీక్ష స్వీకరించేవారు

ఆశ్వీయుజ పౌర్ణమి 20.10.2021 బుధవారము రోజు తె.జా 4గం.లకు దీక్షమాల ధరించవలెను. మండల దీక్ష పూర్తిగా చేసినవారు హోమంలో పాల్గొనవచ్చును.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam